Dr.Mohan Bhagwat ji |
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం-RSS ప్రారంభమైన నాటి నుండి సంఘాన్ని రూపుమాపాలనే ప్రయత్నాలు జరిగాయి. కానీ సంఘ కార్యం సమాప్తం కాలేదు. సంఘాన్ని రూపుమాపాలను కున్నవారంతా సమాప్త మయ్యారు. నిరంతరం ప్రేమ, సత్యం ఆధారంగా సంఘకార్యం కొనసాగుతోంది. అదే సంఘాన్ని రక్షిస్తోంది. ఏ విధంగానైతే హిరణ్యకశ్యపుని నుండి ప్రహ్లాదున్ని నరసింహుడు రక్షించాడో అదేవిధంగా సంఘం రక్షణ పొందుతూ నిర్వఘ్నంగా నడుస్తాంది, ముందుకు సాగుతోంది. భారతదేశాభివృద్ధి కోసం అందరిని కలుపుకొని పోయే ఉద్యమానికి ఊతం ఇవ్వాలి. ఈ కార్యం సంఘం చేస్తాంది. మనందరి పని కూడా ఇదే...
సంఘంపై అనేక రకాలుగా దుష్ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్ని రకాలుగా నిందారోపణలు చేస్తున్నారో అవన్నీ వారికే వర్తిస్తున్నాయి. వాటివల్ల సంఘానికి కలిగే నష్టమేమిలేదు. ఒక్కసారి ఆరోపణలు చేస్తున్నవారెవరో గమనించండి. వారిని పరిశీలించండి. అటువంటివారి గతమేమిటో ప్రస్తుతం ఏమి చేస్తున్నారో, రాబోయే రోజుల్లో వారి పరిస్థితి ఏమిటో అర్ధమవుతుంది.
సమాజంలో అపనమ్మకాలు సృష్టించాలన్నదే వారి ఆలోచన తద్వారా ఆ భయంతో కొంతమంది ప్రజలను తమ వెనుక పోగుచేసుకోవడమే వారి ఉద్దేశం. ప్రజలలో అపనమ్మకాలు సృష్టించి గుంపును పోగు చేయడంపై సంఘానికి నమ్మకం లేదు. ఎవరినీ ఓడించాలను కోవడం లేదు. సంఘానికి ఎవరూ శత్రువులు కాదు. ఈ పనులు చేస్తున్నవారిని సైతం కలుపుకొనేందుకు సంఘం సిద్దంగా ఉంది. సమస్త సమాజంలోని ప్రజలందరూ భారతీయులే. ఎవరికి మినహాయింపు లేదు ఎవరి పట్ల సంఘానికి ఇసుమంత కోపం లేదు.
కొంతమంది ఎదుటివారిపై దుష్ప్రచారం చేసి తాము ప్రచారంలోకి రావాలనుకుంటారు. కొన్నిసార్లు విషయం అర్ధం కాకపోవడం వల్ల కూడా ఇటువంటి ప్రచారం ముమ్మరమవుతుంది. ఎంతమంది సంతానం ఉండాలి అని నన్ను ఒకసారి ప్రశ్నించారు నేను ఇద్దరు అని సమాధానమిచ్చినట్లు పత్రికల్లో ప్రచురించారు. కానీ నేను 'ఇద్దరు ఉండాలనే మాట ఎక్కడా వాడలేదు. నేడు అధిక జనాభా ఒక సమస్యగా మారింది. కనుక సంఘం జనాభా విషయంలో ఒక ప్రతిపాదన చేసింది. అందరి అభిప్రాయాలు స్వీకరించి, మానసికంగా సంసిద్దులను చేయాలి. ఆ తర్వాత దీన్ని అమలు పరచాలి. అందరూ సమ్మతిస్తే జనాభా నియంత్రణ కష్టసాధ్యమేమి కాదు అని నేను వారితో అన్నాను. కానీ ఎలా అర్ధం చేసుకున్నారో తెలియదు. లేదా ముందుగానే ఇటువంటి అపవనమ్మకాలు సృష్టించాలనే వ్యూహరచన అయి ఉండోచ్చు. సంఘం తర్వాత ఎజెండా ఫలానా ఫలానా అంటూ ప్రచారం కొనసాగించారు. ఇంత జరుగుతున్నా సంఘం ఒక్కొసారి ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తోంది. లేదంటే మౌనంగా ఉంటుంది. మనం మనుషులం కావాలను కుంటున్నాం. అందరిని ప్రేమతో కలుపుకొని పోవాలనుకుంటున్నాం. ఇటువంటి ప్రచారాల జోలికి సంఘం వెళ్లదలచుకోలేదు. ఎన్నికల్లో పోటి చేయదలచుకోలేదు కదా! దీని వల్ల సంఘ ఓటు బ్యాంకుకు వచ్చే ధోకా ఏమిలేదు. ఓట్లు ఎక్కువ తక్కువయ్యే ప్రమాదమేమి లేదు. సంఘం ముందుకు సాగుతునే ఉంటుంది.
ఆర్ఎస్ ఎస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేరుగా సంఘశాఖకు రావాలి. లోపలి నుండి గమనించాలి. వచ్చేవారిపై నిషేదం లేదు. ఒక్కపైసా ఖర్చు ఉండదు. సభ్యత్వ రుసుం లేదు. రండి! ఉండండి! చూడండి! పరిశీలించండి! సంఘం ఎలా ఉంది సంఘమంటే ఏమిటి? సంఘ శిబిరాలు, కార్యక్రమాలు చూడండి, సంఘ కార్యకర్తలను కలవండి. వారి కుటుంబాలను దర్శించండి. స్వయంసేవకుల కార్యకలాపాలను గమనించండి. అప్పుడు సంఘమంటే ఏమిటో అర్ధమవుతుంది. పంచదార తియ్యగా ఉంటుందని ఉపన్యాసం ఇవ్వవచ్చు. అంత మాత్రానే రుచి అనుభవానికి రాదు. ఒక్క చెంచా తిని చూస్తే తియ్యదనం అంటే ఏమిటో తెలుస్తుంది.
సంఘాన్ని లోపలి నుండి ప్రత్యక్షంగా దర్శించండి. ఒక అభిప్రాయానికి రండి. వచ్చేవారి మనసులో దురభిప్రాయం కలిగినా సంఘానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకవేళ ఆర్ఎస్ఎస్ తో విభేదించాలను కుంటే అపనమ్మకాలపై కాకుండా సత్యాన్ని ఆధారంగా స్వీకరించండి. నిజాలేమిటో తెలుసుకొని విభేదిస్తే, అది సంఘ కార్యక్రమాలను తీర్చిదిద్దుకొనేందుకు ఆధారం అవుతుంది.
అక్టోబర్ 31, 2015న అఖిల భారతీయ కార్యకారిణి మండలిలో ఆమోదించిన తీర్మానం:
గడిచిన దశాబ్దాల కాలంగా దేశ జనాభా నియంత్రణ కోసం తీసుకొన్న విధానాల్లో, లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం వివిధ మతాల ఆధారంగా తీసుకున్న జనాభా నిష్పత్తిలో అధిక శాతం తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. కనుక జనాభా నియంత్రణ కోసం ఇప్పటివరకు తీసుకుంటున్న చర్యల విషయంలో పునరాలోచిస్తే బాగుంటుందని అఖిల భారత కార్యకారిణి మండలి భావిస్తోంది. వివిధ మతాల జనాభావృద్ధిలో భారీ తేడాలు, ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. అసంఖ్యాకంగా వస్తున్న విదేశీ చొరబాటుదారులు, మతమార్పిడిల కారణంగా జనాభావృద్ధి నిష్పత్తిలో అత్యధిక అసమతుల్యత కనిపిస్తాంది. దీని కారణంగా దేశ ఏకత్వం, సమగ్రత, సాంస్కృతిక గుర్తింపునకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.
1952లోనే జనాభా నియంత్రణ కోసం అవలంభించబోయే విధానాలను ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రదేశాల సరసన భారతదేశం ఒకటిగా నిలిచింది. కానీ 2000 సంవత్సరంలో మాత్రమే ఒక సమగ్రమైన జనాభా నియంత్రణ మండలి అందుకై అవలంభించే విధానాన్ని రూపొందించగలిగింది. 2.1 స్థూల పునరుత్పత్తి ఆదర్శ స్థితిని 2045 వరకు సాధించడం, స్థిరమైన ఆరోగ్యవంతమైన జనసంఖ్య లక్ష్యాన్ని చేరుకోవడం. ఈ విధాన ఉద్దేశం.
జాతీయ వనరులు, భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకొని స్థూల పునరుత్పత్తి లక్ష్యాన్ని సమాజంలో అన్ని వర్గాల్లో అమలు పరచాలని ఆశించారు. కానీ 2005-06 జాతీయ స్థూల పునరుత్పత్తి, ఆరోగ్య సర్వేక్షణ, 2011 జనాభా లెక్కల ప్రకారం 0-6 వయసు గల చిన్నారులు మతాల వారీగా లభించిన లెక్కలు, అసామాన్యమైన స్థూల పునర్పుత్తి, బాలల జనాభా నిష్పత్తి ప్రకారం స్పష్టమైన సంకేతాలు లభిస్తున్నాయి. వీటి ఆధారంగా 1951 నుండి 2011 మధ్య కాలంలో జనాభా వృద్ధిలో భారీగా తేడాలు అనూహ్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల భారతదేశంలో పుట్టిన మతావలంభికులు వారి ఆనుయాయుల నిష్పత్తి 88 నుండి 83.8 శాతానికి పడిపోయింది. అదే ముస్లింల జనాభా నిష్పత్తి 9.8 నుండి 14.23 శాతానికి పెరిగింది.
దీనితోపాటు దేశ సరిహద్దు ప్రాంతాలైన అస్సాం పశ్చిమబెంగాల్, బిహార్ సరిహద్దు జిల్లాల్లో ముస్లిం జనాభావృద్ధి జాతీయాభివృద్ధి కంటే అధికంగా ఉంది వీరందరూ బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ చొరబాటుదారులన్న అంశం స్పష్టమవుతుంది.
సర్వోన్నత న్యాయస్థానం ద్వారా ఏర్పాటయిన : ఉపమన్యు హజారికా కమిషన్ నివేదిక, వివిధ సందర్భాల్లో న్యాయస్థానాల తీర్పులు ఇదే అంశాన్ని నిరూపిస్తున్నాయి. ఈ చొరబాటుదారులు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పౌరుల హక్కులను హరిస్తున్నారన్నది వాస్తవం. అంతేకాదు సంబంధిత రాష్టాల్లో పరిమితంగా ఉన్న వనరుల వల్ల ఈ చొరబాటు దారులు భారంగా తయారవుతున్నారు. ఫలితంగా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, అర్థిక అసమానతలు తలెత్తుతున్నాయి.
ఈశాన్య రాష్ట్రాల్లో మతం ఆధారంగా పెరుగుతున్న జనాభావృద్ధి, అసమతుల్యత అక్కడి పరిస్థితులను విషమంగా మార్చాయి. అరుణాచల్ ప్రదేశ్లో భారతదేశంలో పుట్టిన మతాలను అవలం భించేవారు 1951లో 99.21 0 ఉండేవారు. అదే 2001లో 81.3 శాతం కాగా, 2011లో 67 శాతానికి జనాభా పరిమిత మైంది.' కేవలం ఒక దశాబ్దంలోనే అరుణాచల్ ప్రదేశ్లో క్రైస్తవుల సంఖ్య 13శాతం పెరిగింది. అలాగే మణిపూర్ రాష్ట్రంలో లో 80శాతం కంటే అధికంగా ఉండేవారు నాటి జనాభా లెక్కల ప్రకారం 50శాతానికి పడిపోయారు. పైన పేర్కొన్న ఉదాహరణలు, వాస్తవ కథనాలు గమనిస్తే అనేక జిల్లాల్లో క్రైస్తవులు అసహజ రీతిలో పెరుగుతున్నారు. కొన్ని స్వార్ధపూరిత శక్తులు ఇక్కడివారిని లక్ష్యంగా చేసుకొని పగడ్బందిగా మతమార్పిడులకు పాల్పడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
అఖిల భారతీయ కార్యకారిణి మండలి ఈ జనాభా అసమతుల్యతను తీవ్రంగా పరిగణిస్తోంది దేశంలో లభ్యమవుతున్న వనరులు, భవిష్యత్తు తరాల అవసరాలు, జనాభా అసమతుల్యతను దృష్టిలో పెట్టుకొని దేశ జనాభా విధానాలను పునరాలోచించాలి. వాటిని అందరిపై సమానంగా అమలు పర్చాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతోంది. అంతేకాదు సరిహద్దు రాష్ట్రాల్లో జరుగుతున్న అక్రమ చొరబాట్లను పూర్తిగా నియంత్రించాలి. "జాతీయ పౌరసత్వం రిజిష్టర్ NRC" అమలు పరిచి ఈ అక్రమ చొరబాటు దారులకు పౌరసత్వం ఇవ్వకుండా, భూమిని కొనుగోలు చేసే హక్కులు కల్పించకుండా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది.
దీనిని తమ జాతీయ కర్తవ్యంగా భావించి జనాభా అసమతుల్యత వల్ల ఏర్పడుతున్న అన్ని కారణాలు తెలుసుకొని వాటిని గుర్తించి, జనజాగరణ ద్వారా దేశాన్ని జనాభా అసమతుల్యత నుండి రక్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలని అఖిల భారతీయ కార్యకారిణి మండలి స్వయంసేవకులతో పాటు దేశభక్తులందరిని కోరుతోంది.
వ్యాఖ్యానం: డా.మోహన్ జీ భాగవత్ ( సర్ సంఘచాలాక్, ఆర్ ఎస్ ఎస్ )
రచన: జాగృతి వారపత్రిక {full_page}