యుగద్రష్ట డాక్టర్‌జీ |
కాలం అనంతమైనది. అనంతమైన ఈ కాలాన్ని లెక్కించటంలో ఉగాది (సంవత్సరాది) విశిష్టమైనది. మన కాలగణనకు ప్రతీక పంచాగము. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఉగాది పండుగ జరుపు కుంటాము. ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది? అధునిక శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారు; మన కాలగణన; మన పంచాగం ఏమి చెబుతున్నదీ గమనిద్దాం.
ఆధునిక శాస్త్రజ్ఞానం (ఇప్పటికి అందుబాటులో ఉన్న పరిజ్ఞానం ప్రకారం) ఈ సృష్టి ప్రారంభమై 432 కోట్ల సంవత్సరాలు అయ్యిందని చెబుతారు. మన పంచాంగం ప్రకారం 432 కోట్ల సంవత్సరాలుగా చెపుతున్నది. కాలాన్ని ఎట్లా గణించాలి; మన దేశంలో ఎట్లా గణించ బడుతున్నదో ఈ సందర్భంగా కొన్ని విషయాలు గమనిద్దాం.
➣ ఆరు ప్రాణముల కాలము – ఒక విఘడియ
➣ ఆరువది విఘడియలు – ఒక ఘడియ
➣ అరువది ఘడియలు – ఒక అహోరాత్రం
➣ ఒక అహోరాత్రం – ఒక రోజు
➣ 15 రోజులు – ఒక పక్షము
➣ 2 పక్షములు – ఒక నెల
12 నెలలు ఒక సంవత్సరం; 60 సంవత్సరాలు ఒక ఆవర్తం. 60 సంవత్సరాల ఆవర్తంలో 32 సంవత్సరాలు అయిన హేవళంబనామ సంవత్సరం పూర్తి అయి 33 సంత్సరాలు అయిన విలంబి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.
యుగాలు నాలుగు.
1. కృతయుగము 17,28,000 సంవత్సరాలు,
2. త్రేతాయుగం 12,76,000 సంవత్సరాలు,
3. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు,
4. కలియుగం 4,32,000 సంవత్సరాలు.
ఈ నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం 43,20,000 సంవత్సరాలు. ఇట్లాంటి మహాయుగాలు 27 పూర్తి అయినాయి. 285 మహాయుగంలో కృత; త్రేత, ద్వాపర యుగాలు పూర్తి అయ్యి కలియుగం నడుస్తున్నది. కలియుగం 5119 సంవత్సరాలు పూర్తి అయ్యి 5120 సంవత్సరంలో ఈ విలంబినామ సంవత్సరంలో ప్రవేశించింది.
మన కాలగణన ఖగోళము ఆధారంగా ఉంది. కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? 1) శని 2) గురువు 3) కుజుడు 4) సూర్యుడు 5) శుక్రుడు 6) బుధుడు 7) చంద్రుడు ఈ ఏడు గ్రహాలు మేష రాశిలో కలిసినప్పుడు కలియుగం ప్రారంభమైంది. ఇది క్రీ.పూ. 3102 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి 2 గం.ల 27 ని.ల 30 సెకనులకు జరిగింది. అప్పటి నుండి కలియుగం ప్రారంభమైంది. అంటే 3103+2021 = 5,123 సవత్సరములు అవుతుంది. ఈ వివరాలు మన పంచాంగములలో ఉంటాయి. ఈ కాలగణనలో శకాలు కూడా ఉన్నాయి. శకములు అంటే ఈ దేశ చరిత్రను తెలియచేసేవి. శకాలలో ఎక్కువ వాడుకలో ఉన్నవి. శాలివాహన శకము; విక్రమార్క శకము; యుధిష్టిర శకము. మహాభారత యుద్ధానంతరము ధర్మరాజు పట్టాభిషేకము జరిగిన రోజునుండి యుధిష్ఠర శకం ప్రారంభమైంది. 3076+2021 = 5097 సంవత్సరాలు. అంటే 5097 సంవత్సరాలు పూర్తి అయి 5097 సంవత్సరంలోకి ప్రవేశించింది.
ఈ దేశం మీద జరిగిన భయకర దాడులను తిప్పికొట్టి దేశ సార్వభౌమత్యమును కాపాడిన వారిలో విక్ర మార్కుడు. విక్రమార్కుని మనవడు శాలివాహనుడు. ఈ ఇద్దరి పేర్ల మీద శకాలు ఏర్పడ్డాయి.
విక్రమార్క శకము 2077 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2078 సంవత్సరంలో ప్రవేశిస్తున్నది. శాలివాహన శకము 1942 సంవత్సరాలు పూర్తి చేసుకొని 1943 సంవత్సరాలో ప్రేశిస్తుంది. ఇట్లా మన కాలగణ శాస్త్రబద్ధమైనది. ఈ సంవత్సరం శ్రీ ప్లవ నామ సంవత్సరం 2021 ఏప్రిల్ 13 నుండి ప్రారంభమవుతుంది.
ఈ దేశ చరిత్రకు సంబంధించి విక్రమార్కులు; శాలివాహనుడు లాగా పూ|| డాక్టర్‌జీ ఈ దేశానికి సుమారు12 వందల సంవత్సరాల బానిసత్వం నుండి బయటపడిన ఈ దేశాన్ని శక్తివంతం చేసేందుకు కృషి చేసారు. వారు క్రీ.శ. 1889 సంవత్సరం ఏప్రిల్ 1న ఉగాది రోజు నాగపూర్‌లో జన్మించారు. ఈ దేశం మీద ఇస్లాం ఆక్రమణ ప్రభావం; ఆంగ్లేయుల ప్రభావం; దేశంలో మారుతున్న రాజ్య వ్యవస్థ; హిందూ సమాజంలో అసంఘటితస్థితి ఇవి అన్ని కలిపి డాక్టర్ కేశవ రావుకు హిందూ సమాజ సంఘటన కార్యాన్ని ప్రారంభింప చేసింది. డాక్టర్‌జీ తన 36 సంవత్స రాలో సంఘ ప్రారంభించారు; ఆ తరువాత 15 సంవత్సరాలు పనిచేశారు. స్వాతంత్య్ర పోరాట కాలం నుండి ఈ దేశంలో జరుగుతున్న ఉద్యమాలు విశ్లేషణ చేసినప్పుడు దేశ హితానికి; సామ్రాజ్యవాదుల హితానికి మధ్యగల తేడాను గుర్తించారు. సామ్రాజ్య వాదులు నిజంగా మంచివారైతే ఈ దేశాన్ని బానిసత్వంలో ఎందుకు పడేశారు అని ప్రశ్నించే వారు.
నేటి రాజకీయాలలో ఎన్నో లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకోవాలి. దానికి సామూహిక ప్రయత్నం అవసరం అని డాక్టర్‌జీ గుర్తించారు. ఆరోజుల్లో రాజకీయ నాయకుల వ్యవహారాలు అందులో కాంగ్రెసు నాయకుల వ్యవహారం గుర్తించాలి. ఆరోజుల్లో నాగపూర్‌లో ప్రసిద్ధులైన డాక్టర్ ముంజే గారికి వ్రాసిన ఉత్తరంలో ”కాంగ్రెస్ నాయకులు మంచి వాగ్ధాటి కలవారు. మాట్లాడటంలో మంచి నేర్పరులు, వారు తమ వాక్చాతుర్యంతో ప్రారంభంలో ప్రజలను ఎంతో సమ్మెహితం చేస్తారు. రెండు; మూడు రోజుల తరువాత ఆ ఉపన్యాసాల ప్రభావం తొలగి పోతుంది. ఎందుకంటె కాంగ్రెసు నాయకులు ఆ ప్రజలదగ్గర డబ్బు సంపాదనలో మునిగిపోతారు” అని వివరించారు. ఈ రోజున కూడ వారు ఏమి మారలేదు; మారకపోగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు దీనిని అంటించారు.
రాజకీయాలకు అతీతంగా ప్రారంభమైన సంఘ కార్యము యెడల కాంగ్రెసుకు తీవ్ర అసహనం ఉంది. హిందూ మహాసభకు తీవ్ర అసంతృప్తి ఉండేది. ఈ రెండింటి మధ్య డాక్టర్‌జీ సంఘాన్ని తీర్చిదిద్దారు. సంఘాన్ని నామరూపాలు లేకుండా చేయాలని కాంగ్రెసు చేయని ప్రయత్నం లేదు. రాజకీయ శక్తుల ప్రభావం నుండి దేశాన్ని, దేశ హితాన్ని కాపాడేందుకు రాజకీయ శక్తులతో సంబంధం లేకుండ ఎట్లా పనిచేయవచ్చో; ఆ పని ప్రారంభం ఎట్లా ఉంటుందో సంఘాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇటువంటి సామాజిక శక్తి నిర్మాణం కోసం సంఘాన్ని 1925 సంవత్సరంలో డాక్టర్‌జీ ప్రారంభించారు. ఈ యుగానికి అవసరమైన ఒక శక్తిని నిర్మాణం చేయటానికి ప్రేరణ ఇచ్చిన డాక్టర్‌జీ ఒక యుగద్రష్ట.
__ విశ్వ సంవాద కేంద్రము