కరోనా మొదలు నుంచి దేశ వ్యాప్తంగా సేవా భారతి పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది.
నిరుపేదలకు అండగా సేవాభారతి |
నిరుపేదలకు అండగా సేవాభారతి |
తమిళనాడు లోని కోయబత్తూర్ కు చెందిన “హిందూ ఎకనమిక్ ఫోరం” అనే సంస్థ సేవా భారతి సహకారంతో మైక్రో క్రెడిట్ ఆధారిత వ్యాపారానికి వడ్డీ లేని రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇందులో భాగంగా పురం, కోయంబత్తూర్ కు చెందిన నిరుపేద కుటుంబాలకు కూరగాయలు, పండ్ల వ్యాపారం ప్రారంభించేందుకు సహకారం అందిస్తుంది. ఈ మేరకు శుక్రవారం ఈ ప్రాజెక్టు కన్వీనర్ ఎస్.కే ఆనంద్ ఆధ్వర్యంలో అర్.ఎస్ పురంలోని సేవశ్రమ్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగంగా హిందూ ఎకనామిక్ ఫోరం దాతల ద్వారా నిధులు సేకరిస్తుంది. ఆ మొత్తం కోయంబత్తూరు సేవాభారతి ఆధ్వర్యంలో జమ అవుతుంది.
వడ్డీ లేని రుణాన్ని తిరిగి చెల్లించే, క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే లబ్ధిదారులను కనుగొని వారికి ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ఎచ్ఈఎఫ్ సహకారంతో సేవా భారతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ ప్రక్రియలో భాగంగా మొదట ఇంటర్వ్యూ చేపట్టి సరైన లబ్ధి దారులను సేవా భారతి ఎంపిక చేస్తుంది. ఎంపికైన లబ్దిదారులకు రూ.25000 రుణం అందచేసి, వ్యాపారానికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తారు. ఈ 25వేలను లబ్ధి దారుడు తిరిగి 12 లేదా 18 నెలల్లో ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన మొత్తాన్ని మరో లబ్ధి దారునికి ప్రయోజనం కల్పిస్తారు. ఈ విధంగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.
నిరుపేదలకు అండగా సేవాభారతి |
నిరుపేదలకు అండగా సేవాభారతి |
Source : VSK BHARATH
__విశ్వ సంవాద కేంద్రము
__విశ్వ సంవాద కేంద్రము