సామాజిక పరివర్తన - సంఘం సేవాలక్ష్యము |
మార్గదర్శనం: కీ.శే. కృ.సూర్యనారాయణరావు
సామాజిక పరివర్తన - సంఘం సేవాలక్ష్యము
మనదృష్టి కేవలం సేవ వరకే పరిమితం కాదు. సేవా కార్యక్రమాల ద్వారా వారికి లాభమైతే కలుగుతుంది. కాని సేవయే చివరిది కాదు. సేవకంటే కూడా ముందుకు అడుగులు వేయాల్సి ఉంది. ఇదే మన ప్రత్యేకత. డాక్టర్జీ ఆలోచన ప్రకారం ప్రతి వ్యక్తి దేశభక్తుడు కావాలి. పేదవాడు చదువురానివాడు కూడా దేశభక్తుడు కాగలడు. ఉపేక్షిత బలహీన వర్గాలలోని వారి శక్తిని, సామర్థ్యాన్ని ఈ దిశలో వికసింపజేయడం మనలక్ష్యం. గౌరవప్రదమైన పరంపర కలిగిన ఎంతో గొప్పదైన మనదేశం గురించిన సరైన అవగాహనతో సమాజం కొరకు పనిచేయాలనే భావనను ఇలాంటివారిలో నిర్మాణం చేయాలనేది డాక్టర్లీ ఆలోచన. ఏ సమాజం నుంచైతే తాను స్వీకరిస్తున్నాడో ఆ సమాజానికి తాను తప్పక కొంత తిరిగి ఇవ్వాలి అనే భావనను అతనిలో మేల్కొల్పడాన్ని సేవా కార్యక్రమాల ద్వారా మనం సాధించాలి.
నేను బెంగళూరువద్ద ఉన్న ఒక అనాథ శరణాలయం చూడడానికి వెళ్ళాను. దాని వ్యవస్థాపకులు తమ అనాథశరణాలయంలో శిక్షణ పొంది జీవితంలో ఉన్నత పదవులకు చేరుకున్న బాలుర పట్టికను ఎంతో గర్వంగా చూపించారు. నేను వారిని ప్రశంసిస్తూ “మీరు ఏపిల్లలకైతే సేవచేసి వారికి ఒక సుఖవంతమైన జీవితంలో స్థిరపరిచారో వారు తిరిగి ఈ అనాథాలయానికి ఉపయోగపడుతున్నారా? అని ప్రశ్నించాను. “వారెవరూ ఆవిధంగా ఉపయోగపడడం లేదని వ్యవస్థాపకుడు చెప్పాడు. “ఏ ఆశ్రయంలో వారు పెద్దవారై ఉన్నత పదవులు చేపట్టారో,వారు వారి మాదిరిగా ఇక్కడకు అనాథలుగా వస్తున్న వారికొరకు ఏమైనా చెయ్యాలనే భావన మీరు కలిగిస్తున్నారా?” అని అడిగినప్పుడు “మేము ఆలోచించలేదు” అని ఆ వ్యవస్థాపకుడు చెప్పాడు. కాగా సంఘం యొక్క సేవా కార్యక్రమాల వెనక సామాజిక బాధ్యత అనే భావనని మేల్కొల్పడం దాగిఉంది.
మనకు సేవవల్ల సామాజికంగా లాభం కలుగుతున్నప్పుడు ఇతరులకు సేవచేయడం మన కర్తవ్యం. ప్రభుత్వ ప్రణాళికలద్వారా జరిగే సేవా ప్రకలపాలలో మనుషులకు కేవలం ఎల్లప్పుడు
తీసుకోవాలనే భావనయే ఉంటుంది. దానికి భిన్నంగా సమాజం కొరకు ఏమైనా చేయాలి అనే భావనను వారిలో మనం కలిగించాలి. ప్రయోజనం పొందుతున్నవారిలో వ్యక్తిగత జీవన
వికాసంతోపాటు సామాజిక భావనను మేల్కొల్పడం కూడా మనలక్ష్యం.
ఇదీ చదవండి:
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?” గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ మొదటి భాగం: సంఘం సేవా కార్యమాలు - లక్ష్యములు
➣ రెండవ భాగం: సేవా కార్యక్రమాల ద్వారా మనం ఏం సాదించదలచినాము?
➣ మూడవ భాగం: సేవ - డాక్టర్ జీ ఆలోచన
➣ నాల్గవ భాగం: ఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఐదవ భాగం: సామాజిక పరివర్తన - సంఘం సేవాలక్ష్యము
➣ ఆరవ భాగం: సేవ మరియు జీవితంలో ఇతర గుణాల సంస్కారములు
➣ ఏడవ భాగం: సేవ: సామాజిక సమరసత
➣ ఎనిమిదవ భాగం: సంఘ సేవా భావన నిర్మాణం
➣ తొమ్మిదో భాగం: వ్యక్తి సహజగుణము - స్పందించే హృదయము
➣ పదకొండవ భాగం: సేవాకార్యంలో సహనము అవసరం
➣ పన్నెండవ భాగం: సేవాకార్యంలో దయ కంటే కర్తవ్య భావన.
➣ పదమూడవ భాగం: కార్యంపూర్తి కొరకు మంచి సాధనముగా మారాలి
➣ పదునాలుగవ భాగం: సేవకార్యంలో హిందువుగానే మన గుర్తింపు
➣ పదిహేనవ భాగం: సేవాబస్తీలో సహకారము స్వావలంబన మరియు ఆత్మగౌరవము
➣ పదిహేనవ భాగం: అనుబంధం, సేవ - మనదృష్టికోణము
{full_page}