సేవ |
మార్గదర్శనం: కీ.శే. కృ.సూర్యనారాయణరావు
జీవితంలో ఇతర గుణాల సంస్కారములు
ఈరోజుల్లో బలహీన వర్గాల సోదరులను ఎప్పటికీ ఇతరులపై ఆధారపడి ఉండేట్టు చేయడమే సేవగా భావించబడుతోంది. కాని మనము సేవద్వారా స్వావలంబన, ఆత్మగౌరవము మరియు ఆత్మవిశ్వాసములను వారిలో పెంపొందించాలని అనుకుంటున్నాము.
భగవద్గీతలో కృష్ణుడు ఈవిధంగా అంటాడు:
ఉద్ధరే దాత్మ నాత్మానం నాత్మాన మనసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మన॥
భావము : మనలను మనమే ఉద్దరించుకోవాలి. మనమనసే మనమిత్రుడు లేదా శత్రువు.
అందువల్ల సేవా కార్యక్రమాల ద్వారా తమకాళ్ళపై తాము నిలబడేవిధంగా స్వావలంబన భావనను మనం నిర్మాణం చేద్దాము. జయప్రకాశ్ నారాయణగారు 'సర్వోదయ' పత్రికలో తన అనుభవాన్ని ఈవిధంగా రాశారు. "ఒకసారి పాట్నా నమీపానగల ఒక గ్రామంలో మురికిని తొలగించడానికి తనతోపాటు 15 - 20 మంది యువకులను తీసుకువెళ్లారు. వీధులను ఊడ్చి శుభ్రం చేశారు. ఎరువుల తయారీకొరకు గుంతలు తవ్వి పేడతోపాటు ఆ చెత్తనంతా వాటిలో వేశారు. గ్రామమంతా శుభ్రమై తళతళ మెరవడం ప్రారంభమైంది. ఆ సేవా కార్యక్రమంతో వారందరు సంతృప్తి చెంది తిరిగివచ్చారు.
నాలుగైదు నెలల తర్వాత ఏదో పనిమీద జయప్రకాశ్ నారాయణ గారు ఆ దారినవెళ్తూ ఆ గ్రామ ప్రజలను కలిసి వెళ్దామని అనుకుని గ్రామానికి వెళ్లారు. అక్కడి దృశ్యాన్ని చూసి వారికి చాలా బాధకలిగింది. గ్రామం ఇంతకు ముందుకంటే ఎక్కువ అపరిశుభ్రంగా మారింది. వారిని చూసి అక్కడ గుమిగూడిన గ్రామప్రజలతో జయప్రకాశ్ గారు అసంతృప్తిని ప్రకటించినపుడు ఒక పెద్దమనిషి లేచి 'మీరు ఐదు మసాలా తర్వాత వచ్చారు, మీ తోటివారు కూడా ఈ మధ్యలో మా
గ్రామం ముఖం చూడలేదు. మరిగ్రామం శభ్రంగా ఎలా ఉంటుంది?' అని జయప్రకాశ్ జీని అడిగారు. అంటే ఈ పని మాదికాదు, ఇతరులది. అనే మనోభావన గ్రామ ప్రజల్లో వుంది.
మన సేవా కార్యక్రమాలతో ఈభావనను తొలగించి ఈపని నాది అనే స్వావలంబనను నిర్మాణం చేస్తాము. అంతే కాకుండా క్రిందిస్థాయినుంచి పనిచేస్తూ సేవాకార్యముల ద్వారా వర్గాలలో ఆత్మవిశ్వాసము, ఆత్మ గౌరవము మరియు సంస్కారములను కూడా కలిగించాలి.
ఇదీ చదవండి:
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?” గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ మొదటి భాగం: సంఘం సేవా కార్యమాలు - లక్ష్యములు
➣ రెండవ భాగం: సేవా కార్యక్రమాల ద్వారా మనం ఏం సాదించదలచినాము?
➣ మూడవ భాగం: సేవ - డాక్టర్ జీ ఆలోచన
➣ నాల్గవ భాగం: ఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఐదవ భాగం: సామాజిక పరివర్తన - సంఘం సేవాలక్ష్యము
➣ ఆరవ భాగం: సేవ మరియు జీవితంలో ఇతర గుణాల సంస్కారములు
➣ ఏడవ భాగం: సేవ: సామాజిక సమరసత
➣ ఎనిమిదవ భాగం: సంఘ సేవా భావన నిర్మాణం
➣ తొమ్మిదో భాగం: వ్యక్తి సహజగుణము - స్పందించే హృదయము
➣ పదకొండవ భాగం: సేవాకార్యంలో సహనము అవసరం
➣ పన్నెండవ భాగం: సేవాకార్యంలో దయ కంటే కర్తవ్య భావన.
➣ పదమూడవ భాగం: కార్యంపూర్తి కొరకు మంచి సాధనముగా మారాలి
➣ పదునాలుగవ భాగం: సేవకార్యంలో హిందువుగానే మన గుర్తింపు
➣ పదిహేనవ భాగం: సేవాబస్తీలో సహకారము స్వావలంబన మరియు ఆత్మగౌరవము
➣ పదిహేనవ భాగం: అనుబంధం, సేవ - మనదృష్టికోణము
{full_page}