సేవాబస్తీలో సహకారము స్వావలంబన |
సేవాబస్తీ:
పైలక్ష్యంతో పాటు సేవా కార్యక్రమాలు నడపడానికి మంచి సంస్కారాలు ఇవ్వడానికి ముందుగా మనం మానసికంగా తయారుకావాలి. ఏబస్తీలోనైతే మనం సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాలో ఆ బస్తీని హరిజనబస్తీ మురికి వాడ, అంటరానివాళ్ళ బస్తీ అని పిలవడం మంచిదికాదు. ఈపదాలు వాడకంలోనే మనం వేఱు, వారు వేణు అనే భావన నిర్మాణం అవుతుంది. అందువల్ల మనం వీటికి సేవాబస్తే అనే పదాన్ని వాడుతున్నాం.
పంచతంత్ర కథలు అందరికి తెలిసి ఉంటాయి. పాటలీపుత్రం రాజుగారి కుమారులను విద్యావంతులు జ్ఞానవంతులుగా చేయడానికి అన్నిరకాల ప్రయత్నాలు విఫలం కావడంతో వారికి పశుపక్ష్యాదుల కథలు వినిపించడం ద్వారా ఆ మూర్ఖరాజకుమారులను నీతికోవిదులుగా, జ్ఞానవంతులుగా తీర్చిదిద్దే పనిని విష్ణుశర్మ అనే ఒక చతురుడైన వ్యక్తి చేసి చాపాడు. ఆవిధంగా మనం సేవాబస్తీలో ఏ విషయాన్పైనా తెలియజేయడానికి అక్కడి సులభమైన భాషను, అందరికి అర్ధమయ్యే భాషను వాడడం మంచిది. అందువల్ల కథలు, చిన్న చిన్న పాటల ద్వారా జ్ఞానాన్ని (విద్య) మరియు సంస్కారాలను కలిగించడం బాగుంటుంది.
మంచిని గ్రహించే స్వభావాన్ని నిర్మాణం చేయాలి :
ఈ విషయం గురించి ఆలోచించడం మరియు అర్థం చేనుకునే అభిరుచిని నిర్మాణం చేయడం కూడా సేవాకార్యకర్తల బాధ్యతనే. (The teacher can only help, but the student learns himself) విద్యార్థిలో జిజ్ఞాసను కలిగించినట్టయితే అతను స్వయంగా వికాసం చెందగలడు. అతనిలో గ్రహణశక్తిని మేల్కొల్పే ప్రయత్నం చెయ్యాలి. ఉదా: గులకరాళ్ళు మరియు శనగలు రెండింటిని ఒకేసారి నీరుగల గ్లాసులో పోసి ఉంచితే మరునాటికి శనగలు ఉబ్బి లావు అవుతాయి. గులకరాళ్ళు మునుపటి మాదిరిగానే ఉంటాయి. అంటే శనగలలో గ్రహణశక్తి ఉంది. అలాగే గులకరాళ్ళను కూడా శనగలుగా చేసే పని మనది. అనగా వారి మనసు సంస్కారాలను గ్రహించి విద్యలో లీనమయ్యేట్లు చేయగలగాలి.న వారు అలా తయారుకావాలి. ఇది సేవాకార్య నిర్వాహకుని ద్వారానే కాగలదు.
కుటుంబాలతో పరిచయం :
పిల్లలకు చదువు చెప్పించడమే మన బాధ్యత కాదు కానీ పిల్లలద్వారా వారి కుటుంబాలతో సంబంధం ఏర్పరుచు కోవడం చాలా అవసరం. అనౌపచారికంగా వారి ఇండ్లలో చొచ్చుకొనివెళ్ళి అనేక మూఢాచారాలను మెల్లమెల్లగా తొలగించాలనే సహజదృష్టికూడా సేవాకార్యక్రమ నిర్వాహకులకు ఉండాలి. నిర్వాహకులు సేవాకేంద్రం నడిపేటప్పుడు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయాలి. వాటిని అర్థం చేసుకొని వారి మనసులను హత్తుకునేవిధంగా ప్రయత్నించడం బాగుంటుంది.
వారి అలవాట్లను సరిదిద్దడంలో ఎగతాళి చేయడం, కోపగించుకోవడం మంచిదికాదు. తల్లికి బిడ్డమీద ఎంత ఆత్మీయత, ప్రేమ ఉంటుందో అలాంటి ఆత్మీయతను మనసులో ఉంచుకొని నేర్పాలి. నేర్పడమే (రుద్దడమే)మనవంతు, అనే భావన మంచిదికాదు. మనమంతా ఒకే కుటుంబానికి చెందినవారము అని ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి.
అందరి సహకారము :
సేవాకేంద్రం నడుస్తున్న బస్తీలోని వారందరి సహకారం కూడా ఆ సేవాకేంద్రం యొక్క కార్యకలాపాలలో ఉండడం అవనరం. వారు ఈ సేవాకేంద్రాన్ని తమదిగా భావించగలగాలి. అలాంటి వాతావరణం తయారు కావడంపైనే ఆ కేంద్రం విజయం ఆధారపడి ఉంటుంది. అప్పుడే మనం వారిలో మంచి మార్పు తేగలుగుతాము. సేవాబస్తీకి చుట్టుపక్కల, దగ్గరలో ఉండే సేవాబస్తీకి చెందని ఇతరబంధువులకు కూడా కేంద్రాన్ని చూపించి వారి సహకారాన్ని పొందాలి. వారిని ఈసేవాబస్తీలోని ఉపేక్షిత బంధువులతో పరిచయంలోకి తీసుకురామడానికి వివిధ కార్యక్రమాలు ఏర్పాటుచేయాలి. వాటివల్ల సామాజిక సమరసత నిర్మాణం అవుతుంది. ఈ ఆలోచనను నిరంతరం దృష్టిలో ఉంచుకోవడం అవసరం.
స్వావలంబన మరియు ఆత్మగౌరవము :
సేవాబస్తీలోని బంధువులలో స్వావలంబన, ఆత్మగౌరవ భావనలు మేల్కొల్పాలి. వారిలో హీనభావన లేదా మేము తక్కువవారం అనే భావన తొలగి స్వాభిమానం నిర్మాణం కావాలి. సేవా కార్యక్రమ నిర్వాహకులు ఈ దిశగా దృష్టి సారించడం అవసరం. ఇది కూడా ఒక ఫలితమే.
సేవా కంద్రాలు చక్కగా నిర్వహింపబడాలి. పేదలకు సరియైన దిశ లభించడంతోపాటు సంస్కారాలు దొరకాలి. సామాజిక పరివర్తన ప్రక్రియ గొప్పదిగా ఉండాలి. ఇందుకొరకు సేవాకార్య నిర్వాహకులు ఎప్పటికప్పుడు శక్తి సామర్థ్యాలను కార్యకుశలతను తమలో పెంచుకొంటూ ఉంటేనే ఈ మహత్తర కార్యం సుసాధ్యం కాగలదు. వాస్తవిక దృష్టి లోపము మరియు చైతన్యరహితమైన ప్రవృత్తివల్ల ఏమీ జరగదు అని గమనించడం అత్యంత ఆవశ్యకము.
కొన్ని వ్యావహారిక విషయాలు ప్రణాళిక (యోజన) :
సంఘచాలకులు, కార్యవాహలు, ప్రచారకులు మరియు సేవాప్రముఖులు అందరు కలిసి సేవాకార్యక్రమాల యోజన చేయ్యాలి. సేవా కార్యం కేవలం సేవాప్రముఖులదే అనే భావన సరియైనదికాదు. ఇది మనందరి కార్యం అని గ్రహించడం మంచిది. సేవా కార్యక్రమాల కొరకు మొట్టమొదట సేవాబస్తీల పరిశీలన చెయ్యాలి. మనజిల్లాలో నగరాలలో ఎన్ని సేవాబస్తీలున్నవో వాటి సూచీ తయారుచేయాలి.
సేవాబస్తీ ఎంపిక :
సేవాకార్యం ప్రారంభించడానికి ముందు సేవాబస్తీల యొక్క అవసరాల ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ధారించుకోవాలి. మన పనికి అనుకూలమున్న బస్తీలో మొదట సేవాకార్యం ప్రారంభించడం మంచిది. ముందునుంచే వ్యతిరేకత తెచ్చుకోవడం మంచిది కాదు. ఆ బస్తీవారి సహకారాన్ని స్వీకరించాలి. ఎందుకంటే కార్యక్రమం యొక్క ప్రారంభం వల్ల కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఈ విధమైన కార్యం యొక్క నమూనా నిలబెట్టడం అనేది పనిపెరగడం దృష్ట్యా చాలా మంచిది.
సేవాకార్యముల ఎంపిక :
సేవాకార్యక్రమాలు చాలా రకాలుగా ఉంటాయి. విద్యాపరంగా బాలసంస్కార కేంద్రాలు, అభ్యాసిక, ఉచిత బోధన, సంచీ గ్రంథాలయం, వైద్యపరంగా వైద్య కేంద్రం యోగా కేంద్రం, సామాజిక పరంగా భజనమండలి, మాతృ మండలి, స్వావలంబనలో కుట్టుశిక్షణ, కంప్యూటర్ శిక్షణ మొదలగునవి. అయితే సేవాబస్తీలో ఏ కార్యక్రమం ప్రాథమికంగా అవసరమో ఆలోచించాలి. కేరళలో త్రివేంద్రం ఒక ఐలహీన బంధువుల బస్తీ ఉంది. ఆ బస్తీలో సేవ గురించి ఆలోచించగా మొట్టమొదట ఆరోగ్య సేవా పారంభించబడినది. ఎందుకంటే ఆ బస్తీలో ఎక్కువ మంది నేస్తులే, ఆ బస్తీలో వైద్యం అవసరం చాలా ఉంది. కనుక ఉచితంగా వైద్యం అందజేయాలని మొబైల్ మెడికల్ వ్యాన్ దాంతోపాటు ఒక సంపర్కకార్యకర్తను నియమించడం జరిగింది.
వైద్యం ద్వారా ఆక్కడి బంధువులు మన పరిచయంలోకి వచ్చారు. తర్వాత సంస్కార కేంద్రం, పాఠశాల ప్రారంభమయ్యాయి. ఫలితంగా అక్కడ ఎవరైతే జేబు దొంగలుగా, ఇతర నేరస్థులుగా
పేరుపడ్డారో, ఆ విద్యార్థులే మెట్రిక్ పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. బస్తీ అంతటా ఒక మంచి మార్పు వచ్చింది.
మరొక ఉదాహరణ : చెన్నై దగ్గర్లో ఒక బస్తీరీలో ప్రజలు తాగుబోతులుగా ఉండేవారు. తాగుడు అలవాటు కారణంగా వారికి చర్మవ్యాధులు వచ్చాయి. విటమిన్ల లోపం వల్ల ఆరోగ్యం చెడిపోతూ వచ్చింది. ఆరోగ్య పరీక్షల తర్వాత అందరికి విటమిన్ మాత్రలు ఇవ్వబడ్డాయి. వారి వ్యాధి నయమైంది. తర్వాత వారికి మంచినీరు అవసరాన్ని గుర్తించి ఒక చేతి పంపు అక్కడ ఏర్పాటు చేయబడింది. క్రమక్రమంగా మనతో పరిచయం పెరిగింది. ఫలితంగా ఒకరోజు వారందరు ఇకనుంచి మేము సారాయి తయారుచేయము, త్రాగము అనే నిర్ణయానికి వచ్చారు. సారాయి త్రాగడం ఆగిపోయిన తర్వాత వారికి ఉపాధి కల్పించే వృత్తికొరకు కూడా వ్యవస్థ చేయబడింది. ఇప్పుడు వారందరు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు.
సేవా కార్యకర్తల ఎంపిక :
సేవా కార్యం కొరకు ఎలాంటి కార్యకర్తలను ఎంపిక చేయాలి? ఒక శ్లోకంలో చెప్పబడిన విధంగా:
అమంత్ర మక్షరం నాస్తి నాస్తి మూల మనోషధమ్
అయోగ్య: పురుషో నాస్తి యోజక స్త్ర దుర్గభ :
ఏ వ్యక్తినైనా సరైన పద్ధతిలో ఉపయోగించుకోగలిగిన నైపుణ్యం మనకు వుంటే అతను కార్యకర్త కాగలుగుతాడు. అయితే ఈ కార్యంలో కొంచెం పెద్దవయసు గలవారిని ఎంపిక చేయడం బాగుంటుంది. అనగా సామాజిక పరివర్తన దిశలో ఉపయోగపడగలిగే వయసు కలిగిన పాత స్వయంసేవకులు పదవీ విరమణ చేసిన వైద్యులు, ఉపాధ్యాయులు మొదలగువారిని సేవాకార్యంలో నియమించడం ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఎంపిక చేసేటప్పుడు వారిలో సేవావ్రవృత్తి గురించిన, అలాగేవారు ఎంతవరకు ఉపయోగపడగలరు అనే ఆలోచన చేయడం కూడా చాలా అవసరం.
పని నివేదికలు (Documentation) :
పని వివరణను వ్రాసి ఉంచడం కూడా చాలా అవసరం. కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఎటువంటి స్థితి ఉన్నది? మొదలైన మూడు మాసాల తర్వాత ఏ స్థితి ఉన్నది? ఇలా ప్రతి మూడు మాసాలకొకసారి రిపోర్టు వ్రాసి ఉంచాలి. మన పనియొక్క మూల్యాంకనము కూడా ఈవిధంగానే ఉంటుంది. ఏ బస్తీలో సేవాకార్యము మొదలుపెట్టామో అది ఆ బస్తీకి అనుకూలంగా ఉన్నదా? లేదా? అనేది కూడా పరిశీలించాలి. ఇలాంటి విస్తృత నివేదికను సమాజంలోని ఇతర బంధువులకు చూపించి వారినికూడా సేవాకార్యములో జోడించకొనడానికి సౌకర్యంగా కూడా ఉంటుంది.
ఈవిధంగా సేవాకార్యాల గురించి మనం సిద్దాంత పరంగా ఎలా ఆలోచిస్తామో అలాగే వ్యవహారిక విషయాల గురించి కూడా పూర్తి శ్రద్ధచూపడం వల్ల మన లక్ష్యం పూర్తవుతుంది. సమాజాన్నంతటినీ ఏకంచేసే ఉద్దేశ్యంతో ప్రేరణపొంది చేసే సేవా కార్యం విజయవంతం అవుతుంది. ఈ విశ్వాసాన్ని మనసులో నింపుకొని ముందుకు సాగుదాం.
ఇదీ చదవండి:
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?” గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ మొదటి భాగం: సంఘం సేవా కార్యమాలు - లక్ష్యములు
➣ రెండవ భాగం: సేవా కార్యక్రమాల ద్వారా మనం ఏం సాదించదలచినాము?
➣ మూడవ భాగం: సేవ - డాక్టర్ జీ ఆలోచన
➣ నాల్గవ భాగం: ఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఐదవ భాగం: సామాజిక పరివర్తన - సంఘం సేవాలక్ష్యము
➣ ఆరవ భాగం: సేవ మరియు జీవితంలో ఇతర గుణాల సంస్కారములు
➣ ఏడవ భాగం: సేవ: సామాజిక సమరసత
➣ ఎనిమిదవ భాగం: సంఘ సేవా భావన నిర్మాణం
➣ తొమ్మిదో భాగం: వ్యక్తి సహజగుణము - స్పందించే హృదయము
➣ పదకొండవ భాగం: సేవాకార్యంలో సహనము అవసరం
➣ పన్నెండవ భాగం: సేవాకార్యంలో దయ కంటే కర్తవ్య భావన.
➣ పదమూడవ భాగం: కార్యంపూర్తి కొరకు మంచి సాధనముగా మారాలి
➣ పదునాలుగవ భాగం: సేవకార్యంలో హిందువుగానే మన గుర్తింపు
➣ పదిహేనవ భాగం: సేవాబస్తీలో సహకారము స్వావలంబన మరియు ఆత్మగౌరవము
➣ పదిహేనవ భాగం: అనుబంధం, సేవ - మనదృష్టికోణము
{full_page}