Razakars - Hyd map |
–చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి
పదిహెడు సెప్టెంబర్ అనగానే. తెలంగాణ ప్రాంతం లోని ఎన్నో హిందు కుటుంబాలు. ‘రజాకార్’ ల అరాచకాలను. అమానుషాలను. తలచుకొని ఆవేశపడటం జరుగుతూనే ఉంది. అధికార దాహం. మత ఛాందసవాదం. ఆధిపత్య ధోరణి. హింసాత్మక ప్రవృత్తి మూల సూత్రాలుగా ఈ రజాకార్ కార్యక్రమాలు మొదలై, ఆటవిక అరాచక రాజ్యానికి దారితీసిన చరిత్ర మనం గమనించ వచ్చు. అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఈ కలుపు మొక్కలు మళ్లీ చిగురించి. ప్రస్తుత హిందూ ‘నిజాము’ పాలనలో ‘అభివృద్ధి’ పంటను ఎదగనీయని పరిస్థితి కనిపిస్తోంది.
గతంలోలాగానే దేశం యావత్తు ఒకేతాటిపై నడుస్తూఉండటం అనేక కీలకమైన అంశాలపై తాత్సారంలేని నిర్ణయాత్మక ధోరణితో నాయకత్వం నడుచుకోవడం. దీంతో దిక్కుతోచని అరాచకవాదులు. మతమౌఢ్యంతప్ప వేరే ఆలోచనలేని’ అ’ శాంతి’వాదులు. అధికారంకోసం ఏ దారుణాలకైనా తెగించే రాజకీయవిషసర్పాలు. పొరుగుదేశాలలో అధికారంలో తమ కామ్రేడ్స్కోసం తమ తలతాకట్టు పెట్టి ఎఱ్ఱగంతలగాడిదలు అన్నీ కలిసి మళ్ళా అప్పటి పరిస్థితులను పునరావృత్తం చేస్తారేమొ అనిపించడం వింతేమికాదు. సారూప్యాలు మనకు అర్ధం అవుతూనేఉన్నాయి. ఇటీవలి కాలంలో ఢిల్లీ లో జరిగిన అల్లర్లు. ఆ అల్లర్లకు కారణమైన సంస్థలు. బెంగళూరు నగరంలో జరిగిన విధ్వంసం వాటి వెనుక ఉన్న కుట్ర. అంతకు ముందు తెలంగాణ రాష్ట్రం లోని భైంసా లో జరిగిన విధ్వంసం ఇవన్నీ చరిత్రను పునరావృతం చేస్తున్నట్టే కనిపిస్తోంది.
రజాకార్ లు అరాచకార్ లు గా మారి సామాన్య ‘హిందూ’ జనబాహుళ్యాన్నిభయకంపింతులను చేసే ప్రయత్నానికి కారణమైన పరిస్థితులు మనం గమనిస్తే అప్పటి కి యావత్భారతం బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ ఏకతాటిపై నడుస్తూంటే. ఆ ‘శాంతి’ మతస్తులు మాత్రం ఎక్కడో టర్కీలోని ‘ఖిలాఫత్’ కోసం తెగ ఆయాస పడిపోయి , అనేక రకాలైన మూర్ఖత్వాన్ని ప్రదర్శించి ఏమీ చేయలేక, ఆ ఉక్రోషాన్ని ‘ హిందువులపై’ చూపి అనేక అరాచకాలు జరిపిన పరిస్థితి. కేరళాలో, గుజరాత్ లో, బెంగాల్ లో, ఉత్తర ప్రదేశ్ లో ఇలా అనేక చోట్ల ఈ అరాచకాలు జరిగాయి. ‘ ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ‘ లోనే అప్పట్లో ఈ అరాచక భావాలను, ఆధిపత్య ధోరణీ నూరిపోసి పంపించే వారు. ఆ ‘శాంతి’ యుత భావజాలం లో తర్ఫీదు పొందిన ఒకానొక దుష్ట ‘గ్రహ’ శకలంశ్రీయుత ‘ఖాసిం రజ్వీ’ సూకరోత్తముడు. వారు విద్యావంతులు పై పెచ్చు, మత ఛాంధసులు. వారి నాయకత్వం లో ఈ “ఇత్తెహదుల్ముసల్మీన్” అనే సంస్థ ఈ అరాచకాలకుతెరతీసింది. వారికి ఉన్న ప్రధాన మైన సమస్య ఏమిటీ అని ఆలోచిస్తే, ‘ భారత దేశానికి స్వాతంత్య్రం వస్తే, అప్పటి దాకా ముస్లిం రాజ్యం గా ఉన్న హైదరాబాదు సంస్థానం, ముస్లిం రాజ్యంగా ఉండదు’ అది వారి మనస్సును అల్లకల్లోలం చేసిన సమస్య. సరే ‘రాజ్యాధికారం’ వదులుకోవటం కష్టం అయిన పనే, అయితే రాజ్యం నిలుపుకోవాలంటే ఏం చెయ్యాలి?? తగిన సైన్యాన్ని సిధ్ధం చేసుకోవాలి. సరిహద్దుల వద్ద సైన్యాన్ని మొహరించి శత్రువుని ఎదుర్కోవాలి. ఇలా ఏదోక వీరోచితమైన విన్యాసాలు, రాజనీతి ప్రదర్శించాలి. ఏ పరిపాలకుడైనా చేసే సాధారణ చర్యలు ఇవి.
కానీ ఇక్కడ ఉన్నది ఎవరు సాక్షాత్తు ‘ ఖాసిం రజ్వీ’ మహశయుడు, వారు ‘నిజాము’ గారి అప్రకటిత సైన్యాధ్యక్షుడు. వారి వీరత్వం కృరత్వం అనితర సాధ్యం. వారు అరివీర భయంకరంగా చేసిన యుద్ధం ఎవరిమీద?, అమాయకులైన సామాన్య ప్రజానికం పైన ‘ అది కూడా హిందువులైతేనే’. మీకు అనుమానం రావచ్చు అలా ఎందుకూ? వాళ్ళు రాజును ఏమన్నా ఎదిరించారేమొ అందుకే అట్లా’ అని. అలాంటి పిచ్చి సంశయాలు పెట్టుకునే మీరందరికీ ఆ మహశయుడు అప్పట్లో పత్రికా ముఖంగా ప్రకటించారు కూడా. ” హిందువులను చంపడం ముస్లిం ల జన్మసిధ్ధ హక్కు” అని. “సంస్థానంలోని కోటి అరవై లక్షల’ హిందువుల’ నందరినీ తగలపెట్టేస్తాననీ” కూడా సభాముఖం గానే ప్రకటించారు.
వారి వీరోచిత కార్యక్రమాలు అనేకంగా ఉన్నాయి. నిరాయుధులైన సామాన్య హిందువులపై దాడి చేయుట, హిందూ స్త్రీ లను మానభంగం చేయటం ద్వారా వారి ప్రవక్త చూపిన స్వర్గానికి అర్హత సాధించుట, పైగా ఆ స్త్రీమూర్తుల చే నగ్నంగా ‘ బతుకమ్మ ‘ ఆడించి పరమత సహనం చాటుట. ఇలా అనేకానేక వర్ణించనలవి గాని అనేక చారిత్రక కార్యాలు. సరే ఇదంతా మీ వంటి సహన శీలురకు చాలా ఇబ్బందిగా ఉండి ఉండ వచ్చు అప్పుడెప్పుడో జరిగిన దుస్సంఘటనలు ఇప్పుడు ఎందుకు? మన సైన్యం పోలీసు చర్య జరిపింది వారి పీచమణిచి వేసింది కదా ఇంకా అదే పట్టుకు కూర్చోవటం అవసరమా? అని. మీరు చెప్పింది అక్షరాలా నిజం, అప్పుడు అలా జరిగింది కదా మరి ఆ నాలుగు లక్షల ‘రజాకార్’ ల ను సైన్యం అణచివేసింది నిజమే. మరి ఆ ‘భావజాలాన్ని’ ఏం చేసింది??. సమాధానం చాలా సులువు ‘ ఆ భావజాలం’ ఇంకా అదే పేరుతో హైదరాబాద్ నగరంలో కొనసాగుతూ విషవృక్షం గా తన ఊడలు దించుతూనే ఉంది. జాతీయవాదం ఈ వేర్పాటు వాదాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తునే ఉంది. కానీ అవకాశ వాద రాజకీయం మాత్రం, వారు కోరిన విధంగా ” పదిహేను నిముషాలు పోలీసులను ఎలా తప్పించాలా??” అన్న అరాచకపు ఆలోచనే చేస్తోంది. మరి మీరు ఏం చేస్తారు?? తలవంచి అరాచకాన్ని ఆహ్వానిస్తారా?? లేక జాగృతి తో సశక్త భారత సమాజానికి జేజేలుచెబుతారా??.
మతమౌఢ్యం మూల స్తంభంగా ఎదిగే మూర్ఖత్వాన్ని నిర్ధ్వందంగా నిరసించి తరిమికొడతారా లేక నా దాకా రాలేదులే అనుకున్న” స్వాతంత్య్రం పూర్వం …. పాకిస్తాన్ అని ఇప్పుడు చెప్పబడుతున్న ప్రాంతం లోని హిందువుల లాగా ” ధన, మాన, ప్రాణాలను కోల్పోతారా??. మీ చుట్టూ ఉన్నఈ సెక్యులర్ సమాజానికి తగిన కట్టుదిట్టం చేస్తారా? లేదా కళ్ళు మూసుకున్నపిల్లులలాగా మీ ఆస్తులు తగుల బెట్టిన తరువాత కానీ గమనించుకోరా?? మీరు నిర్మించుకున్నమీ ఊహల సౌధాన్నిఈ అరాచకవాదం ఛిన్నాభిన్నం చేస్తుంటే మనం ఏమి చేస్తే బాగుంటుంది?“ చిన్నపామునైనా పెద్దకఱ్ఱతో కొట్టాలి‘ అన్నట్టుగా మన శాంతియుత సమాజం కోసం ఆలోచనలు సాగాలి ? యువత భావోద్రిక్తం అయ్యి ఆఅరాచక ఎజెండా సఫలీకృతం కానీయకుండా తగిన సన్నద్దతతో ఉండే విధంగా తగిన వ్యూహ రచన జరగాలి. ఇవన్నీజరగాలి అంటే బాధ్యత కలిగిన ప్రతీ పౌరుడు ఒకనాయకుడు కావాలి. మీకు దిశానిర్దేశం కావాలీ అంటే ఇదిగో ఈ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన అ’సామాన్యుల’ చరిత్రను చదవండి. అరాచకాన్నిఆత్మస్తైర్యంతో ఎదుర్కొన్న వీరుల సంస్మరణ జరపండి. మళ్ళా అలాంటి పరిస్థితి రాకుండా చూడండి.
వ్యాస మూలము: విశ్వ సంవాద కేంద్రము {full_page}