Dr. Mohan Bhagawath ji |
మహారుషి మోహన్ భాగవత్
(ఇటీవల జరిగిన ఉత్తరాంచల్ విశ్వహిందూ పరిషత్ సమావేశంలో పూజ్య స్వామీజీ చేసిన అనుగ్రహ భాషణలోని ఒక విభాగ సారాంశం.)
ప్రపంచమంతటిలోను ప్రాచీనమైనది హిందూమతం. వేదమతం-సనాతనమతం వ్యవహారంలోని పదాలు. ఒకప్పుడు హిందూమతంలో అంతర్భాగాలుగా - శైవ, వైష్ణవాదులు కూడా మతం అన్నపేరుతో ఉండేవి, అయితే వీటన్నింటికి వేదశాస్త్ర పురాణాలు ప్రమాణ గ్రంథాలు, ఈ ప్రమాణాన్ని అంగీకరించని బౌద్ధ, జైనమతాలు వచ్చిన తరువాత కొన్ని విపరీత పరిణామాలు వచ్చినవి. అప్పటిదాక ఈ దేశంలోని అన్ని ఆలోచనా మార్గాల వారు ఇది భరతభూమి అని. అందరి తల్లి భారతమాత అని భావించేవారు. ఆసేతుశీతా చలం భాషలు వేరైనా, దేవుళ్లు వేరైనా ఒకే జాతికి చెందిన వాళ్లమని భావించి తీర్థయాత్రలు, దివ్యక్షేత్ర దర్శనాలు చేసేవారు.
బౌద్ధమతం విదేశాలలో కూడా ప్రబలిన తర్వాత వారు ఈ జాతిమీదకు దండయాత్రకు వస్తే మనమతం వారని విజ్ఞాతీయులు ఈ జాతిని జయించటానికి తోడ్పడినారు బౌద్ధులు ఇప్పటి బౌద్ధం దాదాపు హిందూమతంలో కలసిపోయింది. బౌద్దమతాధిపతి దలైలామా బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో చరిత్రను పరిశీలించినప్పుడు మహమ్మదీయ, క్రైస్తవ మతాల వల్ల జాతీయతకు వచ్చిన ప్రమాదం - ఫలితాలు అందరికీ తెలిసినవే.
వీటిని జాగ్రత్తగా గమనించి ఇటీవల కొద్దిరోజుల క్రింద "రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ RSS" - సర్ సంఘచాలక్ మోహన్జీ భాగపత్, భాగ్యనగరంలో ప్రసంగిస్తూ. " ఈ దేశంలో ఉన్న ఏ మతస్తుడైన తాను హిందూజాతికి చెందినవాడనని భావించాలి. తన ఇష్టదేవత ఎవరైనా కావచ్చు. ఎవరినైనా ఆరాధించవచ్చు. తాను క్రైస్తవుడైతే నేను హిందూ - క్రిష్టియన్ అని తాను ముహమ్మదీయుడైతే హిందూ ముస్లిం అని జాతికి ప్రాధాన్యం ఇచ్చి తీరాలి' అన్నారు. " స్వాగతించవలసిన ఈ మహత్తర తత్వాన్ని అంగీకరించటానికి ఇష్టం లేనివారు ఆ భావనను తీవ్రంగా ఖండించారు.
ధర్మవ్యవస్థలో ఒక సంఘర్షణాత్మకమైన పరిస్థితి ఏర్పడినప్పుడు - జాతి ధర్మానికి హాని కలిగినప్పుడు ధర్మస్వరూపుడైన పరమేశ్వరుడు తగిన వ్యక్తిని ఎన్నుకొని ధర్మచైతన్య ప్రసారం చేయటం జరుగుతుంది. అటువంటి వారినే ప్రాచీన కాలంలో ఋషులనేవారు. ఆ కోవలోని ధర్మవీరుడు - ఋషి మోహన్జీ భాగవత్. ఈనాడు భారతదేశంలో మారిన, మారుతున్న పరిస్థితులను గమనించి మారవలసిన ధర్మబద్ధ సూచనల నా మహాపురుషుడందించాడు.
కొన్ని దశాబ్దాల కింద కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎంసీ చాగ్లా నేను జాతిరీత్యా హిందువును. విశ్వాసాన్ని బట్టి మహమ్మ దీయుడను' అన్నాడు. ఆ భావన జాతీయ ధర్మభావుకమైనది. ఈ సందర్భంలో చాలాకాలం విశ్వాసాన్ని క్రింద ఆర్గనైజర్ పత్రికలో అంతర్జాతీయ ప్రచారంపొందిన వార్త ప్రచురితమైంది.
ఈజిప్టులో ఒక ముస్లిం ఆ మతాధికారి - ముల్లా - సంచలనాత్మకమైన వ్యాసం వ్రాశాడు. "నేను మహమ్మదీయుడను. అల్లా నా దైవం. ఆ శబ్దానికి సర్వేశ్వరుడని అర్థం. అది సర్వనామం. అంటే ఇంగ్లీషులో కామన్ నౌన్. ప్రాపర్ నౌను ఉండాలికదా ! నేను గ్రంధాలన్నీ వేదికను దొరకలేదు. భారతదేశానికి వచ్చిన తర్వాత అల్లా పేరు కృష్ణుడని తెలుసుకొన్నాను అన్నాడు.
ఎవరు ఈ భరతభూమిని తల్లిగా భావిస్తారో, ధర్మవీరులై ప్రకాశించిన రాముడు, కృష్ణుడు మొదలైన వారిని ఆరాధ్యులుగా భావిస్తారో, వేదకాలం నుండి ప్రజలకు మార్గనిర్దేశకులైన ఋషిపరంపరను గురుదేవులుగా విశ్వసిస్తారో వారే నిజమైన హిందువులు.
రచన: శ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి
మూలము: జాగృతి వారపత్రిక, సౌజన్యంతో {full_page}