History of Zero |
చరిత్రపుటలను తిరగేస్తుంటే మనకి ఒక విషయం స్పష్టమౌతుంది. అదేమిటంటే “సున్న” 9 వ శతాబ్దపు పరిసరాల్లోకనుగొన్నారు. అయితే ఇటీవల లభ్యమైన మరికొన్నిఆధారాల ద్వారా “0” ను మరో 500 ఏళ్ళ క్రితమే కనుగొన్నారని తెలుసుకున్నారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నకొన్నిప్రాచీన తాళపత్రాల ద్వారా “సున్న” 3 లేదా 4వ శతాబ్దంలో, సుమారుగా 224 AD మరియు 383ADల మధ్య కనుగొనబడిందని తెలుస్తోంది. దీనితో గణితపరంగా “సున్న”ను ఎవరు ఎలా ఉపయోగించారన్నదానిపై ఆసక్తి నెలకొంది.
పరిశోధనల ప్రకారం ప్రాచీన భారతీయ తాళపత్ర గ్రంధాలలో కనిపించే అంకెలు ‘భక్షాలి (bakhshali) లిపి’లో ఉన్నాయి. ఈ గ్రంధాలలో 70 పత్రాలు పూర్తిగా గణితపరమైన విషయాలతో కూడిఉండి సంస్కృతంలో లిఖించబడ్డాయి. ‘మార్కుస్ డిసౌతాయి’ అనే పరిశీలకుని ప్రకారం ఇవి బహుశా బౌద్ధ సన్యాసుల విద్యాభ్యాసంలో భాగంగా ఉపయోగించిన శిక్షణా పత్రాలు అయి ఉండవచ్చు. ఇప్పటి పాకిస్తాన్ లో ఉన్న ఒక గ్రామంలోని స్థానిక రైతు వీటిని కనుగొన్నారు. ఆ గ్రామం పేరే ఈ పత్రాలకు పెట్టడం జరిగింది. 1902 నుండీ ఈ పత్రాలు ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని బోలియాన్ (Bodleian) లైబ్రరీ లో భద్రపరచబడ్డాయి.
ఈ గ్రంధం మరో విషయాన్ని కూడా సూచిస్తోంది. భారత్ లోని గ్వాలియర్లో ఉన్న ఒక దేవాలయం గోడల మీద 9వ శతాబ్దపు శాసనంలో ‘సున్న’ను చూసారు. ఇది సున్నా ఉన్న అతి పురాతన శాసన రూపానికి ఉదాహరణ. ఇదే గోడపై వ్రాయబడిన విశేషాలలోవందలాది సున్నాలను(0), చుక్కలను (.) కూడా చూడవచ్చును. తరువాతకాలంలో సున్నాను ఒక చుక్క మధ్యలో ఉండే ఒక చిన్నఖాళీ ద్వారా గుర్తించేవారు. అదే ఈ రోజు మనం వాడుతున్న ‘సున్న’. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చుక్కను సాధారణంగా ఒకసంఖ్యలో స్థానాన్ని సూచించడానికి వాడేవారు. ఉదాహరణకు 505 అనే సంఖ్యలో పదులస్థానంలో ఏమీలేదని చెప్పటానికి సున్నాను ఎలా వాడుతున్నామో ఆకాలంలో సున్నాబదులు చుక్కను ఉపయోగించేవారు. ఎందుకంటే అప్పటికి సున్నాను ఇంకా ఒక అంకెగా గుర్తించటం జరగలేదు.
మయన్, బాబిలోనియన్ వంటి పురాతన సంస్కృతులలో సున్నాను స్థానాన్ని గుర్తిచడానికి వాడేవారు కానీ, కేవలం భారతీయ సంసృతిలోని ఈ చుక్క(.) మాత్రమే అంకె హోదాని పొందింది. ఈ విషయం క్రీ.శ 628కి చెందిన ఖగోళ మరియు గణిత శాస్త్రజ్ఞుడు బ్రహ్మగుప్తుడు తెలియజేసాడు.
మార్కస్ అనే శాస్త్రజ్ఞుని పరీశీలన ప్రకారం చాలావరకు మనం ఈరోజు ఉపయోగిస్తున్న సంఖ్యాభావనలు ఊహాజనితమైనవి. అంకెలనేవి వస్తువులను గణించడానికి ఉన్నాయి. మరి ఏ వస్తువు లేనిచోట అంకెల అవసరం కూడా ఉండదుకదా అనేది ఒక ఆలోచన. మొదట్లో సున్నావాడకం నిషేధించబడినప్పటికీ, తరువాతకాలంలో అవసరాలు మారుతున్నకొలదీ కలనగణితపు అభివృద్ధి కోసం సున్నాను అనుమతించారు.ఈ పరిణామం నూతనయుగ అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది.
500 సంవత్సరాల చరిత్రలో కొన్ని ప్రాచీన మరియు నూతన ఆవిష్కరణల మధ్య ‘సున్నా’ ను స్పష్టమైన తేదీలతో ఎప్పుడు కనుగొన్నారో చెప్పలేకపోవచ్చుకానీ, ఇన్ని ఆధారాలను ఒకేచోట ఎలా సమకూర్చగలిగారనేది కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఈవిధంగా అంతటా విస్తారంగా వినియోగించబడుతున్న’సున్న’ వెనుక ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
రచన: అంజలి తుల్సియాన్