దేశ విభజన |
– ప్రశాంత్ పోల్
భారత జాతీయ పతాకం గురించి గాంధీజీ నిన్న లాహోర్‌లో చేసిన ప్రకటనకు దేశవ్యాప్తంగా అనేక వార్తాపత్రికలలో బాగా ప్రచారం లభించింది. ముంబై నుండి వచ్చే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రత్యేక వార్త, డిల్లీ నుండి వచ్చే హిందుస్తాన్ పత్రికలో లో మొదటి పేజీలో, కలకత్తా నుండి వచ్చే స్టేట్స్ మన్ వార్తాపత్రిక, అలాగే మద్రాసు నుండి వచ్చే’ది హిందూ’ పత్రిక కూడా ఈ వార్తను ప్రచురించింది.
జాతీయ జెండాలో చరఖా లేకపోతే నేను ఆ జెండాకు వందనం చేయను అని ప్రకటించడం మహాత్మాగాంధీ వ్యక్తిత్వానికి, ఆయనకున్న పేరుప్రతిష్టలకు సరిపోలేదు. ఈ వార్త భారతదేశంలోని చాలా దినపత్రికలకు చేరలేదు. అందుకే ఈ వార్త ప్రచురించబడలేదు, కానీ పంజాబ్ కు చెందిన పంజాబీ, హిందీ, ఉర్దూ వార్తాపత్రికలు ఈ ప్రకటనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాయి. మరుసటి రోజు ఉదయానికల్లా ఈ ప్రకటన అందరికీ చర్చనీయాంశమయింది, మొత్తం దేశం దీని గురించే మాట్లాడుకోవడం ప్రారంభించింది.
—-—-
లాహోర్ నుండి వెలువడే డైలీ మిలాప్ హిందువుల ప్రధాన వార్తాపత్రిక. అంతకుముందు, హిందూ మహాసభ అధికారిక భారత్ మాతా దినపత్రిక చాలా మంది హిందువులలో ప్రాచుర్యం పొందిన పత్రిక. కానీ కొన్ని నెలల క్రితం, దానిలో గాంధీజీ గురించి చాలా అవమానకరమైన పదాలలతో కొన్ని తప్పుడు వ్యాఖ్యానాలను ప్రచురించారు. ఆ తరువాత ఆ దినపత్రిక దాదాపు మూతపడింది. సింధ్ ప్రావిన్స్ లోని హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమావేశం గురించి మిల్ప్, వందే మాతరం, పరాస్, ప్రతాప్ వంటి చాలా దినపత్రికలు ప్రచురించాయి. ఆ పత్రికలు సర్ సంఘ్ చాలక్ గురూజీ ప్రసంగాన్ని కూడా క్లుప్తంగా ప్రచురించాయి. గురూజీ ప్రసంగాన్ని డాన్ అనే ఆంగ్ల దినపత్రిక కూడా ప్రచురించింది.
గురువారం ఉదయం రావల్పిండిలోని ఒక ఇంట్లో పాకిస్తానీ హిందూ మహాసభ నాయకులు చిన్న సమావేశం నిర్వ హిస్తున్నారు. ఇపుడు విభజన తప్పదని, రావల్పిండితో పాటు పంజాబ్ లో చాలా భాగం, అంతే కాకుండా మొత్తం సింధ్ ప్రావిన్స్ పాకిస్తాన్ లో కలుస్తాయని తేలిపోయింది. పాకిస్తాన్ ముస్లిం నేషనల్ గార్డ్ లు హిందువులపై, వారి ఆస్తులపై దాడులను నిరంతరం పెంచుకుంటుపోతున్నారు.ఇలాంటి పరిస్థితులలో, పాకిస్తాన్‌లో మిగిలిపోయిన హిందువుల కోసం ఏదైనా చేయవలసిన అవసరం ఏర్పడింది. అందుకే ‘పాకిస్తాన్ హిందూ మహాసభ’ నాయకులు తమ ప్రకటనలలో ఒకదాన్ని అన్ని వార్తాపత్రికలలో ప్రచురించడానికి విడుదల చేసారు.ఈ ప్రకటనలోవారు, పాకిస్తాన్‌లో నివసిస్తున్న హిందువులు ముస్లిం లీగ్ జెండాను గౌరవించాలని కోరారు. దీనితో పాకిస్తాన్ హిందూ మహాసభ, పశ్చిమ పంజాబ్‌లో ముస్లిం లీగ్ అసెంబ్లీ నాయకుడిగా ఎన్నికైన ఇఫ్తీఖర్ హుస్సేన్ ఖాన్ మెండాన్‌ను అభినందించారు. అదేవిధంగా, తూర్పు బెంగాల్ అసెంబ్లీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన ఖ్వాజా నిజాముద్దీన్ కు ఒక బహిరంగ కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలిపారు. ఆ విధంగా పాకిస్తాన్ కు ఒక రూపం వచ్చింది.ఇపుడు హిందువులు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడమే కాక అంగీకరించాలి కూడా.
—-—-
హైదరాబాద్ …. సింధ్
ఆ రాత్రి చినుకులు పడుతుండడం వాతావరణంలో వేడిని తగ్గించింది. గురూజీ తొందరగా మేల్కొన్నారు. గురూజీ తీసుకునే ప్రభాత్ శాఖలో స్వయంసేవకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.అంత మంచి పెద్ద మైదానంలో వారు ఆరు గణలలో ఆడుతున్నారు. ఈ రోజు, గురూజీ స్వయంగా శాఖలో ఉన్నారు, దీనిని చూసిన స్వయంసేవకుల ఆనందానికి అవధులు లేవు. కానీ త్వరలోనే మన పూర్వీకుల ఈ పవిత్ర భూమి పరుల సొంతమవుతుంది, మనం భారతదేశంలోని తెలియని ప్రాంతానికి వలస వెళ్ళాలి అనే ఆలోచన ఆ వాళ్ళకు విచారం కలిగించింది.
శాఖ ముగిసిన తరువాత అనధికారిక సమావేశం జరిగింది. స్వయంసేవకులు అందరికీ అల్పాహారం అందించారు. గురూజీ ఉద్రిక్త పరిస్థితిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. స్వయం సేవకులలో విశ్వాసం పెంచాలని ఆయన ప్రయత్నం. వారంతా హైదరాబాద్, సింధ్ ప్రావిన్స్ పరిసర ప్రాంతాల నుండి హిందువులను భారతదేశానికి ఎలా సురక్షితంగా తీసురావాలి అని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు, భారత ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంలో కొంచెం కూడా సహాయం చేయలేదు. ఈ హిందువులను భారతదేశంలోఎక్కడ ఉంచాలి, వారిని ఎక్కడ స్థిరపరచాలి అనే విషయంలో ప్రస్తుత,రాబోయే భారత ప్రభుత్వాలకు ఎటువంటి దిశా నిర్దేశం లేదు. ఎందుకంటే ప్రాథమికంగా జనాభా మార్పిడి అనే భావనను కాంగ్రెస్ తిరస్కరించింది.
తూర్పు పంజాబ్,సింధ్ ప్రావిన్స్ లోని హిందువులు అక్కడే నివసించాలని, ముస్లిం మతోన్మాదులు దాడి చేస్తే వారు నిర్భయంగా తమను తాము త్యాగం చేసుకోవాలని గాంధీజీ సలహా ఇస్తున్నారు. ఈ పరిస్థితిలో, హిందువులను కాపాడి, అవసరమైన ధైర్యం చెప్పి, ప్రమాదం నుండి బయటకు తీసుకురావాల్సిన భారత ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు.రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు మాత్రం దీనిని ఒక సవాలుగా తీసుకున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు అల్పాహారం ముగించి గురూజీ కరాచీకి త్వరగా బయలుదేరారు.గురూజీకి వీడ్కోలు పలుకుతున్నప్పుడు హైదరాబాద్,ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన స్వయం సేవకులు కన్నీళ్ళు పెట్టుకున్నారు. వారిని ఓదార్చడం కష్టమైంది. గురూజీ తిరిగి ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. సింధ్ ప్రావిన్స్ లో ఆయన చేసే చివరి పర్యటన ఇదే అని గురూజీకి కూడా బాగా తెలుసు. సమయం కదలకుండా ఇంకా నిలబడి ఉన్నట్లు అనిపిస్తోంది. వాతావరణం మొత్తం గంభీరంగా ఉంది. కానీ తిరిగి వెళ్ళడం అవసరం. గురూజీకి ఇంకా చాలా పనులున్నాయి. గురూజీ అబాజీ తట్టే, రాజ్‌పాల్ జీ ఇతరులతో కలిసి కరాచీ వైపు నెమ్మదిగా కదిలారు.
మాస్కో
దాదాపు సరిగ్గా అదే సమయంలో రష్యాలోని ఉదయం ఆరు గంటలకు మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయానికి,అప్పటి సోవియట్ యూనియన్‌లో మొదటి భారత రాయబారిగా నియమించబడ్డ శ్రీమతి విజయలక్ష్మి పండిట్ చేరుకున్నారు.ఆగస్టు నెల మాస్కో నివాసితులకు వేసవి కాలం అయినప్పటికీ, విజయలక్ష్మి పండిట్ ఆ వాతావరణంలో చలితో వణుకుతున్నారు. స్వతంత్ర భారతదేశ పతాకంగా మారబోయే అశోక్ చక్రం అమర్చిన జాతీయ పతకాన్ని మాస్కో విమానాశ్రయంలో ఎగురవేశారు. బహుశా ఇదే మొదటి సందర్భం కావచ్చు అధికారికంగా స్వతంత్ర భారతదేశ పతకాన్ని భారతదేశం వెలుపల ఎగురవేయడం. ఇది గుర్తుకు వచ్చిన విజయలక్ష్మి పండిట్ నవ్వారు. .
నలభై ఏడు సంవత్సరాల విజయలక్ష్మి పండిట్ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సొంత సోదరి అయినప్పటికీ, అదే ఆమె గుర్తింపు కాదు. ఆమె కూడా చాలాసార్లు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించింది. ఆమె స్వతహగా సహజమైన తెలివితేటలు గలది. విజయలక్ష్మి పండిట్, జవహర్ లాల్ నెహ్రూ కంటే దాదాపు పదకొండు సంవత్సరాలు చిన్నది కాబట్టి ఆమెకు నెహ్రూతో సాన్నిహిత్యం తక్కువ. ఆమె 21 సంవత్సరాల వయసులో ప్రసిద్ధ న్యాయవాది, ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ కతియవార్ కు చెందిన రంజిత్ పండిట్‌ను వివాహం చేసుకుంది.
విజయలక్ష్మి పండిట్ ను స్వతంత్ర భారతదేశానికి రష్యాలో భారత రాయబారిగా నియమించినప్పుడు, ఆమె జవహర్‌లాల్ నెహ్రూ సోదరి అనే అర్హత మాత్రమే కాదు, ఆమె సొంత సామర్థ్యం కూడా పరిగణించి నియమించారు.భారత రాయబారి, జవహర్‌లాల్ నెహ్రూ సోదరి అయిన విజయలక్ష్మి పండిట్ ని రష్యా అధికారులు హృదయపూర్వకంగా, ఆత్మీయంగా స్వాగతించారు. రష్యాలో భారత రాయబారిగా ఆమె పదవీకాలం చాలా అద్భుతంగా ప్రారంభం.
—-—-
మధ్యాహ్నం, ఒంటి గంట సమయంలో వైస్రాయ్ సాహెబ్ ప్రత్యేక డకోటా విమానం కరాచీలోని మౌరిపూర్ విమానాశ్రయంలో ఢిల్లీ నుండి వచ్చిన కైడ్-ఎ –అజామ్ మహమ్మద్ అలీ జిన్నాతో ల్యాండ్ అయింది. జిన్నా, ఆయన సోదరి ఫాతిమా,ఆమె ముగ్గురు సహచరులు కూడా విమానం నుండి దిగారు. పాకిస్తాన్ సృష్టికర్తగా, ‘ప్రతిపాదిత పాకిస్తాన్’ మొదటి సందర్శన సందర్భంగా ముస్లిం లీగ్ కార్యకర్తలలో ఏ మాత్రం ఉత్సాహం లేదు. అందుకే జిన్నాను స్వాగతించడానికి చాలా తక్కువ మంది కార్యకర్తలు విమానాశ్రయానికి వచ్చారు. ఆ కార్యకర్తలు పాకిస్తాన్, జిన్నా జిందాబాద్ వంటి నినాదాలు చేసినప్పటికీ, వారి గొంతులో ఉత్సాహం ఏమాత్రం లేదు. కయాద్-ఎ-అజామ్ జిన్నాతన కోసం, తన జీవితకాల కలల దేశం పాకిస్తాన్ మొదటిసారి రావడం చాలా నిరాశపరిచింది.
——-
ముంబై ….
ఆకాశంలో మేఘాలున్నాయి. వర్షం కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. బోరి బందర్‌లోని ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ముందు ఒక చిన్న ఉత్సవం నిర్వహించారు. బాంబే ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్ (BEST)కు చెందిన రెండు బస్సులు భవనం ముందు నిలబడినవి,అక్కడ ఒక చిన్న పందిరి ఏర్పాటు చేయబడింది. 1874 నుండి ముంబై నివాసితుల సేవలో పనిచేస్తున్న సంస్థ ‘బాంబే ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్’ ఇప్పుడు భారతదేశ స్వాతంత్ర్యానికి వారం ముందు ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోకి మారబోతోంది. ఈ సందర్భంగా వేడుక జరుగుతున్నది. ‘బెస్ట్’ లో 275 బస్సులున్నాయి, ఆ బస్సులన్నింటిని 1947 ఆగస్టు 7 న ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఆధీనంలోకి బదిలీ చేస్తున్నారు. ముంబై చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది ..
వరంగల్ ….
కాకతీయ రాజవంశ రాజధాని. ప్రసిద్ద వెయ్యి స్తంభాల గుడి ఉన్న నిజాంషాహి రాజ్యంలోని పెద్ద నగరం. ఉదయం పదకొండు గంటలు. ఆగస్టులో కూడా సూర్యుడు అగ్గిలాగా మండుతున్నాడు. గాలి కూడా రావడం లేదు.చాలా దూరం వరకు మేఘాల సంకేతాలు లేవు. చెట్లు,మొక్కల ఆకులు నిశ్శబ్దంగా మరియు నిర్జీవంగా ఉన్నాయి. వరంగల్ నగర ప్రధాన కూడలి అంతా దాదాపు నిశ్శబ్దంగా ఉంది. అటువంటి వాతావరణంలో అకస్మాత్తుగా వందలాది మంది కార్మికులు కూడలి వద్ద గుమిగూడి, కాంగ్రెస్ జెండాను మోస్తూ, “నిజాం షాహీ రాజ్యాన్ని యూనియన్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలి” అని నినాదాలు చేశారు …. కాంగ్రెస్ కార్యకర్తల ఈ నిరసనకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొలిపాక కిషన్ రావు గారు నేతృత్వం వహించారు.
హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఈ కార్యకర్తలు భారతదేశంలో విలీనం కోసం నిజాంకు వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించారు. సత్యగ్రహంలో చేరాలని హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామ్‌తీర్థ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాచిగూడ ప్రాంతంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఆయన స్వయంగా నినాదాలు, ప్రదర్శనలలో పాల్గొన్నారు.. భారతదేశంలో ప్రతిచోటా స్వేచ్చా వాణిని వినిపించవచ్చు.కానీ నిజాం రాజ్యంలోని ఈ విశాలమైన భూమిలో ఇప్పటికీ బానిసత్వచీకట్లు తప్ప స్వేచ్ఛలేదు.. రజాకార్ల రాక్షస హింసలో ప్రజలు బలవంతంగా జీవిస్తున్నారు.
కలకత్తా….
కలకత్తాకు చెందిన ఆనంద బజార్ పత్రిక, డైలీ బాస్మతి, స్టేట్స్ మన్ వంటి అన్ని దినపత్రికల మొదటి పేజీలోని ఆనాటి ప్రధాన వార్త ఏమిటంటే చక్రవర్తుల రాజ్‌గోపాలాచారి అలియాస్ ‘రాజాజీ’ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారని . ఈ విభజించబడ్డ బెంగాల్‌కు అంటే ‘పశ్చిమ బెంగాల్’కు రాజాజీ మొదటి గవర్నర్‌గా ఉండబోతున్నారు, రాజాజీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు. మొత్తం మద్రాస్ ప్రావిన్స్ ను ఒంటరిగా నడుపుతున్నప్పటికీ ఇటీవల ముగిసిన ప్రాంతీయ ఎన్నికలలో ఆయన ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇది కాకుండా, బెంగాల్ విభజనకు అనుకూలంగా రాజాజీ అత్యంత ఉత్సాహంగా పని చేయడం కారణంగా బెంగాల్ ప్రజలకు ఈ నిర్ణయం నచ్చలేదు.
తన లైబ్రరీలో కూర్చొని ఈ వార్త విన్న శరద్ చంద్రబోస్ అతని ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. అతను వెంటనే ఒక ప్రకటన తయారు చేసి అన్ని దినపత్రికలకు ప్రచురణ కోసం పంపించాడు. శరద్ బాబు ఇలా వ్రాశారు, ” బెంగాల్ గవర్నర్‌గా రాజగోపాలాచారి నియామకం నిజంగా బెంగాల్ కు అవమానం. మద్రాస్ ఎన్నికల్లో ఓడి తిరస్కరింపబడిన వ్యక్తి మమ్మల్ని ఉద్దరించేది ఏమిటి? అని.
ఢిల్లీలోని భారత సైనిక ప్రధాన కేంద్రం లో …
భారత కమాండర్-ఇన్-చీఫ్ కార్యాలయంలో క్రమశిక్షణ గల వాతావరణం, బాగా మెరుస్తున్న యూనిఫాంలో సైనికుల కదలిక కొనసాగుతోంది. కొంచెం లోపలికి వెళితే, వాతావరణంలో మార్పు స్పష్టంగా ఉంది. మరింత తీవ్రమైన … మరింత క్రమశిక్షణ … మరింత గౌరవనీయమైన వాతావరణం. తలుపు వద్ద ఇత్తడి నేమ్ ప్లేట్ మీద పెద్ద ట్రంకీ అక్షరాలలో – సర్ క్లాడ్ జాన్ ఆచిన్లెక్ అని వ్రాసిన పేరు వేలాడుతోంది. ఆ కార్యాలయ భవనం ఆవరణలోనే వెనుక ఉన్న ఒక పెద్ద మహోగని టేబుల్ వద్ద సర్ ఆచిన్లెక్ కూర్చున్నాడు. ఆ టేబుల్‌పై ఉన్న ఒక చిన్న యూనియన్ జాక్, అకస్మాత్తుగా మా అందరి దృష్టిని ఆకర్షించింది.
చాలా ముఖ్యమైన ఉత్తరాన్ని సర్ ఆచిన్‌లెక్ ముందు ఉంచారు. ప్రతిపాదిత స్వాతంత్ర్య దినోత్సవం రోజున, రాజకీయ స్వభావం గల భారతీయ ఖైదీలందరి విడుదల గురించి ఆ నోట్ షీట్ లో ఉంది. ఆ ఉత్తరంలో , ‘ఆల్ ఇండియన్స్’ అనే పదం సర్ ఆచిన్లెక్ దృష్టిని ఆకర్షించింది. ఆల్ ఇండియన్స్ అంటే సుభాష్ చంద్రబోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీలో పోరాడిన సైనికులు కూడానా…? బ్రిటిష్ వారికి నిజమైన సవాలు విసిరిన ఆజాద్ హింద్ ఫౌజ్ లోని సుభాష్ చంద్రబోస్ సహచరులను విడుదల చేయాలా? అది కానే కాదు. కనీసం ఆగస్టు 15 వరకు బ్రిటిషు వారికీ అధికారం ఉంది, నేను వారిని వదిలిపెట్టను.
ఆచిన్లెక్ తన స్టెనోను పిలిచి హీనమైనస్వరంలో , మొరటుగా ఇలా వ్రాయించాడు, ఇతర రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయడానికి భారత సైన్యానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ సైనికులను వదిలివేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము.
ఆ విధంగా, భారతదేశ విముక్తి కోసం తమ జీవితాలను అర్పించిన, సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ లోని వీర సైనికులందరూ కనీసం ఆగస్టు 15 వరకు తప్పించుకోలేరు అని నిర్ణయించారు. ఇంతలో, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మద్రాస్ ప్రావిన్స్ ప్రజలందరికీ ఐదు ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తామని మద్రాస్ ప్రభుత్వం ఆ మధ్యాహ్నం ఒక సర్క్యులర్ ను విడుదల చేసింది. దీనితో పాటు ఆగస్టు 15, 16 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినం కూడా ప్రకటించారు. ఇప్పుడు స్వేచ్చా సూర్యుడు ఉదయించడానికి ఒక వారం మాత్రమే ఉంది …
సమయం మధ్యాహ్నం నాలుగు గంటలు. మద్రాసులో స్థానిక సినిమా హాల్ నిర్వాహకుల సమావేశం జరుగుతోంది. స్వాతంత్ర్యనేపథ్యంలో నిర్వహించబడుతున్న ఈ సమావేశంలో కెసిఆర్ రెడ్డి అదరికన్నాసీనియర్ థియేటర్ యజమాని,ఆయన ఇలా ప్రతిపాదించారు – ఆగస్టు 15 నుండి బ్రిటిష్ వారి జాతీయ గీతం అన్ని సినిమాహాళ్లలో వేయబడదు. ఏదైనా భారతీయ దేశభక్తి గీతం దాని స్థానంలో ప్లే చేయబడుతుంది అని. ఆ ప్రజాభిప్రాయ ప్రతిపాదనను ఉరుములలాంటి చప్పట్లతో అంగీకరించబడింది.
మరోవైపు, శ్రీమతి సుచేతా కృపలాని కరాచీలోని ఒక పెద్ద భవనంలో దాదాపు వంద మంది సింధి మహిళలతో సమావేశాన్ని తీసుకుంటున్నారు. అసురక్షిత వాతావరణం ఉన్నప్పటికీ ఈ సింధి మహిళలందరూ ఆ బంగ్లాలో గుమిగూడారు. సుచేత కృపలాని భర్త, ఆచార్య జెబి కృపలాని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు. విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ అంగీకరించడం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల మానసిక స్థితి చాలా కోపంగా ఉంది. అందువల్ల, భార్యాభర్తలిద్దరికీ వారి ప్రాంతంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రగులుతున్న వాతావరణాన్ని శాంతింపచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సింధి మహిళలందరూ ముస్లింల క్రూరమైన దారుణాలను ఎదుర్కొంటూ, వారు ఎంత అసురక్షితంగా ఉన్నది సుచేత కృపలానికి వివరించారు.
కానీ సుచేతా కృపలాని ఆ మహిళల వాదనలతో ఏకీభవించలేదు. ఆమె వారిని ఆలింగనం చేసుకుని, నేను పంజాబ్ మరియు నోఖాలిలలో స్వేచ్ఛగా తిరుగుతున్నాను, ముస్లిం మతోన్మాదులు నన్ను చూడటానికి కూడా ధైర్యం చేయడం లేదు. ఎందుకంటే నేను అందమైన మేకప్ గాని లిప్ స్టిక్ గాని వాడటం లేదు. మీరు లోనెక్ జాకెట్టు, పారదర్శక చీరలు ధరిస్తారు అందుకే ముస్లిం గూండాల దృష్టి మీ వైపుకు మళ్ళుతుంది.ఒకవేళ వారి గుంపు మీపై దాడి చేసిందని అనుకుందాం, అప్పుడు మీరు రాజ్‌పుత్ సోదరీమణుల ఆదర్శాన్నిపాటించాలి అంటే ‘జౌహర్’ చేయాలి ( మీకు మీరే అగ్నిలో దూకాలి)
(ఇండియన్ డైలీ మెయిల్ – ఆగస్టు 7నాటి వార్తలు. మొదటి పేజీ)
ఆ విశాలమైన భవనం లో కూర్చున్న సింధి మహిళలు తమ జీవిత దినాలను లెక్కించుకుంటూ భయపడుతుంటే సుచేత కృపలాని ఈ ప్రకటనపై వారుఏం మాట్లాడగలరు. వారికి మాటలు రావడం లేదు. ఒక జాతీయ అధ్యక్షుడి భార్య మాకు చెబుతున్నది ఏమిటి?ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో మహిళలు అందమైన అలంకరణ చేస్తారా? తక్కువ కట్ జాకెట్టు ధరిస్తారా? ముస్లింలు మన పట్ల ఆకర్షితులయ్యే ఏకైక కారణం ఇదేనా? వారు మనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే, మన గౌరవాన్ని కాపాడకోవడానికి మనల్ని మనం చంపుకునే పరిస్థితి మాత్రమే మిగిలి ఉందా, మనం ఆ రాజ్‌పుట్ మహిళలతో సమానంగా జౌహర్ చేయాలా? అని. కాంగ్రెస్ నాయకులు మాత్రమే కాదు వారి భార్యలు కూడా వాస్తవ పరిస్థితులకు, ఈ రకమైన ముస్లిం మనస్తత్వానికి దూరంగా ఉన్నారు.
——-
ఢిల్లీలోని అదే ఆర్మీ ప్రధాన కార్యాలయం …
రెండవ అంతస్తులో పెద్ద సమావేశ గది. గూర్ఖా రెజిమెంట్ సంబంధించి సైనిక ప్రధాన కార్యాలయంలో ఒక చిన్న కార్యాలయం ఉంది. ప్రపంచం మొత్తంలో ‘గూర్ఖా రైఫిల్స్’ పేరిట తమ ధైర్యాన్ని ప్రదర్శించిన వీర జవానుల చిన్న రెజిమెంట్ అది. ఈ రెజిమెంట్‌కు చెందిన నలుగురు అధికారులు పెద్ద టేబుల్ వద్ద తీవ్రమైన చర్చలు జరుపుతున్నారు. భారత సైనికులను విభజన చేయబోతున్నారు కాబట్టి ఇప్పుడు గూర్ఖా రెజిమెంట్ పాకిస్తాన్ వెళ్తుందా?అని, ఇదే ఇపుడు ప్రధాన సమస్య. అంతకుముందు బ్రిటిష్ అధికారుల అభ్యర్థన మేరకు గూర్ఖా రెజిమెంట్లోని కొంతమంది సైనికులను సింగపూర్ కు ఇచ్చారు. కొంతమంది గూర్ఖా సైనికులను బ్రూనైకి పంపారు. నేపాల్ ప్రభుత్వం కూడా ఈ విషయాలన్నింటికీ అంగీకరించింది. కానీ ఇపుడు ఒక గూర్ఖా సైనికుడు కూడా పాకిస్తాన్ వెళ్ళడానికి సిద్ధంగా లేడు.
చివరగా, గూర్ఖా రెజిమెంట్‌కు చెందిన ఆ నలుగురు సీనియర్ అధికారులు ఏకగ్రీవంగా నోట్ షీట్ తయారు చేసి కమాండర్-ఇన్-చీఫ్‌కు అప్పగించారు, గూర్ఖా రెజిమెంట్‌కు చెందిన ఒక్క జవాన్ కూడా పాకిస్తాన్ సైన్యంలో చేరడానికి సిద్ధంగా లేరని.
——-
లక్నో ….
రాష్ట్ర అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయం, . ధృడమైన శరీరం,మందపాటి మీసాలతో, ఉల్లాసంగా ఉన్న ముఖ్యమంత్రి గోవింద వల్లభా పంత్ తన సహచరులైన కైలాష్ నాథ్ కట్జు, రఫీ అహ్మద్ కిద్వాయి, పిఎల్ శర్మ వంటి మంత్రులతో ఎప్పటిలాగే, తన సహజ స్వభావంలో, నవ్వుకుంటూ, జోకులతో చర్చిస్తున్నారు. బ్రిటీష్ ప్రభుత్వం మార్చిన, వక్రీకరించిన నగరాల, నదుల పేర్లకు మళ్ళీ వాటి అసలు హిందూ పేర్లను పెట్టాలనేది ఆ చర్చ సారాంశం. బ్రిటిష్ వారు గాంగేస్ ను గంగాఅని, యమునా నదిని జమ్నాఅని, పవిత్ర మధుర పట్టణానికి ‘ముత్రా’ అని పేర్లు మార్చారు.. ఇపుడు ఇవన్నీ వాటి అసలు పేరు ద్వారా పిలువబడాలి. ఈ నేపథ్యంలో, ఈ కమిటీ, నదుల, గ్రామాల,నగరాలకు మార్చబడిన పేర్లను వాటి అసలు పేర్లతో మాత్రమే పిలవాలని ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక ఉత్తర్వు జారీ చేసి దీనిని వెంటనే అమలులోకి తేవాలని ప్రకటించింది.
——-
17, యార్క్ రోడ్. జవహర్‌లాల్ నెహ్రూ ప్రస్తుత నివాసం లేదా ప్రస్తుత చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా.
సాయంత్రం ఆరు గంటలు, విదేశాంగ మంత్రి హోదాలో నెహ్రూ వచ్చారు. పాకిస్తాన్ ఉనికిలోకి రావడానికి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. కనుక పాకిస్తాన్‌లో కూడా భారత రాయబారిని కలిగి ఉండటం మనకు అత్యవసరం. భారతదేశం,పాకిస్తాన్ పరస్పరం సామరస్యంతో పరిష్కరించుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. హిందువుల,సిక్కుల స్థానభ్రంశంమే కాకుండా వారి సమస్యలను పరిష్కరించడం ప్రధానమైనది, కాబట్టి పాకిస్తాన్లో భారతదేశానికి ఒక రాయబారి అవసరం. అందుకోసం నెహ్రూ మనస్సులో ఒక పేరు మెదిలింది,అది శ్రీ ప్రకాష్.
శ్రీ ప్రకాష్ ది ప్రయాగ్ రాజ్ అంటే నెహ్రూ అలహాబాద్ నుండి వచ్చాడు. అతను తరచూ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనేవాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో రెండేళ్లపాటు జైలులోనే ఉన్నాడు. శ్రీ ప్రకాష్ వినయశీలి,మంచి వక్త. మంచి పరిపాలనా సామర్థ్యాన్ని కేంబ్రిడ్జ్ లో ఉన్నత విద్యను అభ్యసించిన యాభై ఏడేళ్ల వ్యక్తి. కొత్తగా సృష్టించిన పాకిస్థాన్‌లో భారత ప్రథమ హైకమిషనర్‌గా శ్రీ ప్రకాష్ నియమితులయ్యారు. ఖైద్-ఎ-జామ్ జిన్నా పాకిస్తాన్ పార్లమెంటులో తన మొదటి ప్రసంగం ఆగస్టు 11 న చేయబోతున్నారు. దానికి ముందే కరాచీలో ఈ విషయం నివేదించడం శ్రీ ప్రకాష్‌కు అవసరమైంది.
రాబోయే రెండేళ్ళలో పాకిస్తాన్ నుండి నిరాశ్రయులైన లక్షలాది మంది హిందువులు, సిక్కుల సమస్య … పాకిస్తాన్ మొండి పట్టుదలగల, పద్దతిలేని, మోసపూరిత వైఖరి … కాశ్మీర్ ను ఆక్రమించాలనే యుక్తి … ఇలాంటి మరెన్నో కష్టమైన ప్రశ్నలు, సమస్యలను ఎదుర్కోవాలి అని శ్రీ ప్రకాష్ కలలో కూడా ఆలోచించలేదు.
గురువారం. ఆగస్టు 7 …
ఆ రాత్రి మరింత భారంగా ఉంది. అమృతసర్ నుండి ప్రారంభమైన గాంధీజీ రైలు ప్రయాణం కొనసాగుతోంది. ఎల్లప్పుడూ నడకను ఇష్టపడే వ్యక్తి, అదే స్థలంలో ఇరవై నాలుగు గంటలు కూర్చుని ఉండటం వల్ల గాంధీజీ శరీరం గట్టిపడింది. ఒకే చోట ఉంచడం వాస్తవానికి అతనికి శిక్ష లాంటిది.రైలులో కూడా గాంధీజీ పుస్తక పఠనం, ధ్యానం కొనసాగింది. ఇపుడు రైలు యూనిఫైడ్ ప్రొవిన్ గుండా వెళుతోంది. రైలు ఎక్కడ ఆగినా, కాంగ్రెస్ కార్యకర్తలు, రైల్వే స్టేషన్‌లోని ప్రజలు ఆయనను కలవడం ఖాయం. చాలా మంది ఆయనను అడిగే ఒకే ఒక ప్రశ్న – ‘బాపు, ఈ హిందూ-ముస్లిం అల్లర్లు ఎప్పుడు ఆగిపోతాయి? అని.
ఇక్కడ, ప్రియమైన బాపు రైలులో విశ్రాంతి లేకుండా ఉన్నాడు. వా రెఫ్యూజీ క్యాంప్,లాహోర్ సిటీలలో అతను చూసినవి విన్నవి చాలా భయంకరమైన పీడకలలు. ఇప్పటికీ అతని హృదయం వాటిని అంగీకరించడం లేదు: ‘వారు ముస్లింల దాడికి భయపడి తమ ఇల్లు, భూమి వస్తువులను వదిలి భారతదేశానికి పరుగెత్తాలా? అటువంటప్పుడు నేను ఇప్పటివరకు పాటిస్తూ జీవించిన అన్నీ సూత్రాలు అబద్ధమని నిరూపించబడతాయి … ‘గాంధీజీ రేపు ఉదయం పాట్నాలో దిగనున్నారు. అతని రైలు చీకటిని చీల్చుకుంటూ ముందుకు వెళుతోంది,గాంధీజీ రైలు కిటికీ లోంచి దూరంగా హోరిజోన్ వైపు చూస్తున్నారు … అతని వ్యక్తిగత సంకల్పంలో అనారోగ్య భారతదేశ భవిష్యత్తును చూస్తానేమో అని …!
క్రితం సంచికల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:
మూలము: విశ్వ సంవాద కేంద్రము {full_page}