డా. మోహన్ భగవత్ |
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అంటే ఏమిటి?
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అంటే ఏమిటి? ఇదొక కార్యప్రణాళిక (Methodolon) వ్యక్తి నిర్మాణ కార్యం చేస్తుంది. ఎందుకంటే సమాజపు వ్యవహారంలో అనేక రకాణ తప్ప ఇంకేమీ కాదు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే సంస్థ ఏం చేస్తుంది? అది మార్పులను మనం కోరుకుంటున్నాం. మనకు ఎలాంటి తేడాలులేని సమాజం కావాలి, సామరస్యపూరిత సమాజం కావాలి. దోపిడీలేని సమాజం కావాలి. సమాజంలో నుండి స్వార్థభావనలు తొలగిపోవాలి. అయితే అలా తొలగిపోవా లన్నంత మాత్రాన జరిగిపోదు. సమాజపు వ్యవహారం సజీవ ఉదాహరణలు ముందు ఉంటేనే మారుతుంది.
మనకు ఆదర్శవంతమైన మహాపురుషులకు లోటేమీ లేదు. దేశంకోసం సర్వస్వాన్ని త్యాగం చేసేవాళ్ళు. ఈ భూమిలో అనాదికాలం నుండి నేటివరకూ అనేకమంది ఉన్నారు. అయితే మన సాధారణ సమాజపు ప్రవృత్తి ఏమిటి? అది వారి జయంతులు,వర్ధంతులను జరుపుతుంది. వారిని పూజించడమూ చేస్తుంది. కానీ పొరబాటున కూడా వారిలా తయారుకాదు. ఛత్రపతి శివాజీ మహారాజు మళ్ళీ పుట్టాలి, కానీ నా ఇంట్లో కాదు, పక్కింట్లో పుట్టాలి అనుకుంటుంది. కొన్నేళ్ళ క్రితం రీడర్స్ డైజెస్ట్ లో ఒక వాక్యం చదివాను.
అదిలా ఉంది : 'The ideals are like stars which we never reach' (ఆదర్శ వ్యక్తులు నక్షత్రాల్లాంటివారు, వారిని మనం ఎప్పటికీ చేరుకోలేము) అదర్భాలనేవి దూరంగానే ఉంటాయి, వాటికి పూజకూడా జరుగుతుంది, కానీ అనుసరించడం జరగదు. తర్వాత వాక్యమిలా ఉంది : 'But we can plot our chart according to them' (అయితే వారి అడుగుజాడలలో మన జీవిత గమనాన్ని యోజన చేసుకోవచ్చును.) అందులో ploting the chart అనే పని మాత్రం జరగదు ఇది ఎప్పుడు ఎవరి భరోసాతో జరుగుతుంది? మన పక్కనే ఉన్న వారి వ్యవహారశైలి ప్రభావం మన వ్యవహారం మీద పడుతుంది.
దేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో సందుల్లో స్వతంత్ర భారతపు ప్రతి పౌరుడు తన నిత్య వ్యవహారంలో ఎలా ఉండాలో అలా ఉంటూ, ఎలాంటి పరిస్థితిలోనైనా తన కర్తవ్యాన్ని వదిలిపెట్టకుండా దానిమీద స్థిరంగా నిలబడే, శీలసంపన్నమైన వ్యక్తిగా, సంపూర్ణ సమాజంలో ఆత్మీయసంబంధం కల్గిన వ్యక్తిగా తయారైనపుడు అలాంటి వాతావరణం ద్వారా సమాజపు ఆచరణ (వ్యవహారశైలి) మారుతుంది.
ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో మంచి స్వయంసేవకులను తయారుచేయడమే సంఘ యోజన, మంచి స్వయంసేవక్ అంటే విశ్వాస పూరితమైన, విశుద్ధమైన శీలం కల్గినవాడని అర్థం. మొత్తం సమాజాన్ని, దేశాన్ని తనదిగా భావించి అతడు పనిచేస్తాడు. ఎవరిపట్లా భేదభావం లేకుండా, శత్రుత్వ భావనతో చూడకుండా ఉండటంవల్ల అతడు సమాజపు స్నేహాన్ని మరియు విశ్వాసాన్ని చూరగొంటాడు. ఇలాంటి వ్యవహారం కల్గినవారి బృందం ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో తయారు కావాలి. ఈ ప్రణాళిక 1925లో సంఘం రూపంలో ప్రారంభమైంది. సంఘమంటే ఇంతే, ఇంతకుమించి మరేమీ లేదు.
మీరేం చేయబోతున్నారని డా|| హెడ్డేవార్ ను అడగడం జరిగింది. 1928లో మొదటిసారిగా నాగపూర్ లో సంఘ పథ సంచలనం జరిగినపుడు అందులో చాలా ఎక్కువ మందేమీ లేరు. 21-22 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఆనాటి మన సమాజంలో 21-22 మంది కూడా ఒక దిశలో కాళ్ళు కలిపి నడవటమనేది చాలా అరుదైన విషయమే. కాబట్టి ప్రజలు ప్రభావితులయ్యారు. డా॥ హెడ్లేవార్ వద్దకు వెళ్ళారు. ఆయన విప్లవ మనస్తత్వం కల్గినవారని, ఆయన తన జీవితాన్ని దేశంకోసం సమర్పించుకున్నారని వాళ్ళకు తెలుసు. ఆయనకు చాలా దూరదృష్టితోకూడిన ప్రణాళిక ఏదో ఉంది అని వారికి అన్పించింది. అందువల్ల చాలా విశ్వాసంతో డాక్టర్ గారూ, నేడు 50 మంది అయ్యారు, మరి భవిష్యత్తులో ఇంకేం చేయబోతున్నారు? అని అడిగారు. అప్పుడు డాక్టర్ జీ యాభై తర్వాత 500 చేస్తాను అన్నారు. అయిదు వందల తర్వాత మళ్ళీ అయిదు వేలు చేస్తాను. అయిదువేల తర్వాత ? ఆ తర్వాత ? మీరనుకున్నట్లే అయిందే అనుకోండి, అపుడేం చేస్తారు? యాభైవేలు చేస్తాను. అలా పెరుగుతూ పెరుగుతూ ఆ సంఖ్య అయిదు కోట్లు చేరుకుంటుంది. అంటే, వాళ్ళు మరింత ఆశ్చర్యంగా అపుడైనా వీళ్ళను ఏమి చేస్తారని అడిగారు. అందుకు డాక్టర్జీ మొత్తం హిందూసమాజాన్ని మనం సంఘటితం చేయాల్సి ఉంది. హిందూ సమాజంలో ఒక ప్రత్యేక సంస్థను తయారు చేయాలను కోవడం లేదు. అందరినీ సంఘటితం చేయాలి. దీన్ని వదిలిపెట్టి చేయాల్సిన మరో పనేమీ మనకు లేదు. ఎందుకంటే ఇలాంటి సమాజాన్ని తయారు చేసిన తర్వాత జరగవలసింది దానంతట అదే జరుగుతుంది. దానికొరకు 'మరింకేమీ' చేయాల్సిన అవసరం ఉండదు అన్నారు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
వ్యాఖ్యాకులు: డా. మోహన్ భగవత్ జి గారి ఉపన్యాస మాలిక
విషయము: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దృష్టికోణం