(హిందీ మూలానికి తెలుగు అనువాదం)
ఈసారి విజయదశమి ఉత్సవం పరిమితమైన సంఖ్యతో మాత్రమే జరుపుకుంటున్నామని మీ అందరికీ తెలుసు. దానికి కారణం కూడా మీకు తెలుసు. కరోనా వైరస్ వ్యాపించకుండా నివారించేందుకు సామూహిక కార్యక్రమాలను సాధ్యమైనంత తగ్గించుకోవడం జరుగుతోంది.
మార్చ్ నుంచి ప్రపంచమంతా కరోనా సంక్షోభంలోనే చిక్కుకోవడం వల్ల అభివృద్ధి గురించిన ఆలోచన వెనుకబడింది. గత విజయదశమి తరువాత అనేక చెప్పుకోదగిన పరిణామాలు జరిగాయి.
మార్చ్ నుంచి ప్రపంచమంతా కరోనా సంక్షోభంలోనే చిక్కుకోవడం వల్ల అభివృద్ధి గురించిన ఆలోచన వెనుకబడింది. గత విజయదశమి తరువాత అనేక చెప్పుకోదగిన పరిణామాలు జరిగాయి.
2019 విజయదశమికి ముందే పార్లమెంట్ చర్చ, ఆమోదంతో 370వ అధికరణ రద్దు జరిగింది. 2019 నవంబర్, 9న దీపావళికి ముందు రామజన్మభూమి కేసులో సర్వోచ్చ న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. తీర్పు పట్ల భారతీయ సమాజం చూపిన సహనం, సంయమనం అసాధారణమైనవి. అలాగే ఆగస్ట్ 5న అయోధ్యలో భూమిపూజ కార్యక్రమం అద్భుతంగా, పండుగ వాతావరణంలో జరిగింది. అక్కడ త్వరలోనే రామమందిర నిర్మాణం జరుగుతుంది. రాజ్యాంగ ప్రక్రియను అనుసరించి పార్లమెంట్ లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందింది. పొరుగున ఉన్న దేశాల్లో అణచివేతకు, వేధింపులకు గురవుతూ ఇక్కడికి వచ్చిన మన సోదరసోదరిమణులకు పౌరసత్వాన్ని ఇచ్చే ప్రక్రియను ఈ చట్టం మరింత సులభతరం, వేగవంతం చేస్తుంది. ఈ దేశాల్లో మతపరమైన మైనారిటీల పట్ల వివక్ష మొదటినుంచి సాగుతూనే ఉంది. ఈ పౌరసత్వ సవరణ చట్టం ఏ ఒక్క మతావర్గానికీ వ్యతిరేకం కాదు. ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి పౌరసత్వం పొందాలనుకునేవారికి ఇప్పటివరకు ఉన్న రాజ్యాంగపరమైన ప్రక్రియ యధాతధంగా అందుబాటులోనే ఉంటుంది. కానీ కొత్త చట్టాన్ని వ్యతిరేకించినవారు ఇది ముస్లిం జనాభాను తగ్గించడానికి జరుగుతున్న ప్రయత్నమంటూ ముస్లింలలో లేనిపోని అపోహలు, భయాలు సృష్టించాలని చూశారు.
నిరసన పేరుతో దేశంలో హింసను, అరాచకత్వాన్ని వ్యాపింపచేయడానికి కొందరు అవకాశవాదులు పరిస్థితిని వాడుకోవాలని చూశారు. దానితో దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగి మతసామరస్య వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. కానీ ఈ పరిస్థితిని చక్కదిద్దెందుకు ప్రయత్నించే లోపునే కరోనా సంక్షోభం చుట్టుముట్టింది. అయినా అల్లరిమూకలు, అవకాశవాదులు దేశంలో గొడవలు లేవదీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ మీడియా కరోనా కధనాలతో తలమునకలై ఉండడంతో వీరి కార్యకలాపాలకు పెద్దగా ప్రచారం లభించలేదు.
ప్రపంచ దేశాలన్నింటిలోనూ దాదాపుగా ఒకే పరిస్థితి కనిపించింది. అయితే చాలా దేశాలతో పోలిస్తే కరోనా సంక్షోభాన్ని తట్టుకోవటంలో భారత్ మరింత దృఢంగా నిలిచింది. చాలా దేశాలు ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను మనం తప్పించుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మన పరిపాలన సంస్థలు సకాలంలో రంగంలోకి దిగి నివారణ చర్యలు చేపట్టాయి. ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు అత్యవసర సేవలను అందించే బృందాలను సిద్ధం చేయడం ద్వారా అవి పరిస్థితి చేయిదాటిపోకుండా చూడగలిగాయి. కరోన వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మీడియా బాగా ప్రచారం చేసింది. దీనివల్ల సామాన్య ప్రజానీకంలో కొంతవరకు భయాందోళనలు వ్యాపించినప్పటికీ సమాజం మొత్తంలో జాగరూకత, నిబంధనలను పాటించే క్రమశిక్షణ కలిగాయి. వైరస్ సోకిన రోగులకు చికిత్స అందించడంలో, వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో వైద్య సిబ్బంది. మునిసిపల్ సిబ్బంది, పోలీసు, ప్రభుత్వ సిబ్బంది అపూర్వమైన నిష్టను, బాధ్యతాయుతమైన ధోరణిని కనబరచారు. తమ సొంత కుటుంబాలకు దూరంగా ఉంటూ ఈ కరోనా యోధులు తమ ప్రాణాలకు తెగించి 24గంటలూ సేవలు అందించారు. పౌరులు కూడా తమకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సాటివారిని ఆదుకునేందుకు ప్రయత్నించారు.
సమాజంలో సంవేదన, పరస్పర సహకారం ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం మధ్య విశ్వాసం వంటివి ప్రధానంగా కనిపించినా విపత్కర పరిస్థితులను ఆసరా చేసుకుని లాభం పొందాలన్న ధోరణి కూడా అక్కడక్కడ కనిపించింది. మహిళలు కూడా ముందుకు వచ్చి పనిచేశారు. మహమ్మారి మూలంగా ఉద్యోగాలు కోల్పోయినవారు, సొంత ఊళ్ళకు తరలిపోయినవారు ఇబ్బందులుపడినప్పటికీ, మిగిలినవారు మాత్రం చాలా సహనంతో, ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొన్నారు. తమ కష్టాలను కూడా లెక్క చేయకుండా ఇతరులకు సహాయపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. స్వస్థలాలకు తరలిపోతున్న వారికి వాహన సదుపాయం కలిగించడం, ప్రయాణ మార్గంలో వారికి ఆహారం, నీరు అందించడం, రోగులకు మందులు, ఇతర నిత్యవసర వస్తువులను వారి ఇంటి వద్దనే అందించడం వంటి అనేక కార్యక్రమాలు మొత్తం సమాజంలో అనేకమంది చేపట్టడం కనిపించింది. ఎన్నడూ ఎరుగని ఇలాంటి దారుణ విపత్కర పరిస్థితిని ఎదుర్కునేందుకు చేపట్టిన అనేక సేవాకార్యక్రమాలు మన సమాజపు ఐక్యత, సంవేదనశీలతకు ఉదాహరణగా నిలిచాయి. శుభ్రత పాటించడం, ఆరోగ్యకరమైన జీవన విధానం వంటి మన సంప్రదాయ అలవాట్లతోపాటు రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆయుర్వేదం వంటివి ఈ సమయంలో మనకు ఎంతో మేలు చేశాయి.
సమాజంలోని ఐకమత్యం, ఏకరూపత, అపారమైన సంవేదనశీలత, సహకారం వంటివాటిని ఆంగ్లంలో సోషల్ కాపిటల్ అంటూ ఉంటారు. ఇది ఈ కష్టకాలంగా మనకు బాగా అనుభవానికి వచ్చింది. అలాగే శతాబ్దాల పురాతనమైన మన సాంస్కృతిక విలువలు, పద్దతులు మనకు అక్కరకు వచ్చాయి. ఈ సమయంలో సమాజంలో కనిపించిన ఐకమత్యం, ఆత్మవిశ్వాసం, సహనం వంటివి స్వాతంత్ర్యం తరువాత కొందరికి మొట్టమొదటిసారి అనుభవంలోకి వచ్చాయి. సాటివారికి సహాయం చేయడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వైద్య సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది, ఇతర సేవా కార్యకర్తలతోపాటు అజ్ఞాతంగా పనిచేసిన ఎంతోమందికి నేను మనఃపూర్వకంగా వందనం సమర్పిస్తున్నాను. వారందరూ అభినందనీయులు. ఈ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయినవారికి మన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
ఈ గడ్డు పరిస్థితిని దాటడానికి వివిధరకాల సేవ కార్యక్రమాలు అవసరం. కళాశాలలు, పాఠశాలలు ప్రారంభించడం, ఉపాధ్యాయులకు జీతాలు, పిల్లల ఫీజులు మొదలైన ముఖ్యమైన పనులు చాలానే ఉన్నాయి. సరైన ఆర్ధిక వనరులు లేని పాఠశాలలు తమవద్ద పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారాలు కోల్పోయిన తల్లిదండ్రులు తమ పిల్లల ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పాఠశాలలు తెరవడానికి, ఉపాధ్యాయులకు జీతాలు, పిల్లల ఫీజుల కోసం సహాయం అందించే ప్రయత్నం చేయాలి. వలసల వల్ల అనేకమంది ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ ఉపాధి అన్వేషించుకోవాలి. అయితే తమకు తెలిసిన రంగం కాకుండా కొత్త రంగంలో ఉద్యోగం సంపాదించడానికి ప్రత్యేకమైన, అదనపు నైపుణ్యం అవసరమవుతుంది. అలాగే ఈ సంక్షోభం మూలంగా ఆగిపోయిన పనులను పూర్తిచేయడానికి మళ్ళీ పనివారిని అన్వేషించుకోవడం మరికొందరి సమస్య. కాబట్టి వృత్తినైపుణ్యం లేని పనివారికి తగిన శిక్షణ ఇవ్వడం, వారికి ఉపాధి చూపడం చాలా ముఖ్యమైన పని. ఉపాధి లేని కుటుంబాలలో కలతలు వస్తాయి. తీవ్రమైన నైరాశ్యం వల్ల నేరాలు, ఆత్మహత్యలు పెరుగుతాయి. వీటిని నివారించడానికి కౌన్సిలింగ్ సేవలు అవసరం.
ఇలాంటి అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకుని మార్చ్ నుంచి స్వయంసేవకులు వివిధ రకాల కార్యక్రమాలను చేపడుతున్నారు. సమాజంలో ఇతరులు కూడా ఈ సమస్యలను గుర్తించి దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించే ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తాను.
ఇప్పటికి కూడా ప్రపంచానికి ఈ వైరస్ ను గురించి పూర్తిగా తెలియలేదు. ఇది వేగంగా వ్యాపించేదే అయినా తీవ్రతతక్కువగా ఉన్నాడనే విషయాలు మాత్రం ఇప్పటికీ మనకు అర్ధమయ్యాయి. కాబట్టి ఈ వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. అలాగే ఈ సంక్షోభం మూలంగా తలెత్తిన ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి మనకు తోచిన విధంగా పూనుకోవడం కూడా అవసరం. భయం, ఆందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సామాజిక జీవనం మళ్ళీ యధాస్థితికి వస్తున్న నేపధ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం సూచించిన నిబంధనలను మనం పాటించడమేకాక ఆ విధంగా చేసేట్లు ఇతరులను కూడా ప్రోత్సహించడం మన నైతిక కర్తవ్యం.
ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో మన సమాజానికి సంబంధించిన అనేక విషయాలు మనకు తెలిసాయి. ప్రపంచం మొత్తంలో ఆలోచనాధోరణి మారింది. ఆత్మ చింతన పెరిగింది. ఇప్పుడు `న్యూ నార్మల్’ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకుముందు అనాలోచితంగా, ఆయాచితంగా చేస్తూ వచ్చిన అనేక పనులు ఈ మహమ్మారి మూలంగా పూర్తిగా ఆగిపోయాయి. ఆ పనుల గురించి సమీక్షా, సమాలోచన ప్రారంభమయ్యాయి. కొన్ని కార్యకలాపాలు బాగా తగ్గినా, పూర్తిగా పోలేదు. లాక్ డౌన్ అమలులోకి వచ్చిన వారం లోపునే గాలి ఎంతో శుభ్రపడినట్లు మనకు తెలిసింది. చెరువులు, నదులు, బావులు మొదలైనవాటిలో నీరు స్వచ్ఛంగా తయారైంది. పార్క్ లలో, బహిరంగా ప్రదేశాల్లో పక్షుల కిలకిలారావాలు మళ్ళీ వినిపించాయి. ఆస్తులు కూడబెట్టడంలో, కూడబెట్టినది అనుభవించడంలోనే సమయమంతా వెచ్చిస్తున్న మనకు ఒక్కసారిగా వచ్చిన తీరుబాటుతో జీవితంలో నిజమైన సంతోషం ఏమిటో గుర్తుకువచ్చింది. విలువల ప్రాముఖ్యత తెలిసింది. కరోనా సంక్షోభం మూలంగా ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం, ఏది వ్యవస్థ, ఏది అవ్యవస్థ అనే విషయాలు మానవాళికి తెలిసివచ్చాయి. ప్రజలు సాంస్కృతిక విలువల గొప్పదనాన్ని గుర్తించారు. ప్రకృతితో మమైకమై జీవించడం, కుటుంబ వ్యవస్థ గొప్పదనం వంటివి మానవాళికి మరోసారి తెలిసాయి.
అయితే ఆలోచనా ధోరణిలో మార్పు తాత్కాలికమైనదా, లేక శాశ్వతమైనదా అన్నది కాలమే తేలుస్తుంది. ఒకటిమాత్రం నిజం ఈ సంక్షోభం మానవాళిని కీలకమైన జీవన విలువల వైపు ఆకర్షించిన ఆయస్కాంతంలా పనిచేసింది. ఇప్పటివరకు మార్కెట్ శక్తుల ఆధారంగానే ప్రపంచాన్ని ఏకం చేయాలనుకునే ధోరణి ప్రబలంగా ఉండేది. కానీ సంక్షోభం మూలంగా ప్రతి దేశం తమ బలాలు, వనరులకు తగినట్లుగా వ్యవహరిస్తూ పరస్పరం సహకరించుకోవాలన్న ధోరణి వ్యాపించింది. `స్వదేశీ’ విధానానికి మరోసారి ప్రాధాన్యత పెరిగింది.
వైరస్ వ్యాప్తిలో చైనా పాత్ర గురించి భిన్న కధనాలు వినిపిస్తున్నా, తన సైన్య బలాన్ని ఉపయోగించి భారత సరిహద్దుల్లో హింసను, అలజడిని సృష్టించడానికి, మన భూభాగాలను ఆక్రమించుకునేందుకు చైనా చేసిన ప్రయత్నాలు మాత్రం ప్రపంచానికి స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి. భారత ప్రభుత్వం, సైన్యం, ప్రజలు ఈ దాడిని ధైర్యంగా ఎదుర్కొని, తగిన విధంగా జవాబు చెప్పారు. ఈ దృఢ సంకల్పం, ఆత్మాభిమానం, పరాక్రమం చైనాను నిర్ఘాంతపరచాయి. రాబోయే రోజుల్లో కూడా మనం ఇదే జాగరూకతను, దృఢత్వాన్ని కొనసాగించాలి. చైనా విస్తరణవాద, దుందుడుకు ధోరణి ప్రపంచానికి కొత్తేమీకాదు. ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలను మెరింత మెరుగుపరచుకోవడం, అంతర్జాతీయ సంబంధాలను పటిష్టపరచుకోవడమే చైనా ఆర్ధిక, వ్యూహాత్మక దుష్టపన్నాగాలకు విరుగుడు.
మన ప్రభుత్వపు విధానాలు ఆ దిశగానే సాగుతున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ (బ్రహ్మదేశం) వంటి పొరుగు దేశాలతో మనకు స్నేహపూర్వక సంబంధాలతోపాటు నైతిక విలువలు, విధానాల విషయంలో కూడా సామ్యత ఉంది. ఈ దేశాలతో సంబంధాలను మరింత పటిష్టపరచుకోవాలి. అందుకు అభిప్రాయభేదాలు, చాలాకాలంగా నలుగుతున్న వివాదాలవంటివి త్వరగా పరిష్కరించుకోవాలి. మనం అందరితో స్నేహాన్నే కోరుకుంటాము. అది మన స్వభావం. కానీ మన మంచితనాన్ని బలహీనతగా, చేతగానితనంగా భావించి పశు బలంతో దాడిచేసి మనల్ని బలహీనపరచడానికీ, విచ్ఛిన్నం చేయడానికి జరిగే ప్రయత్నాలను మాత్రం అంగీకరించలేము. మన విమర్శకులు ఈ విషయాన్ని గమనించాలి. భారతమాత వీరపుత్రుల శౌర్యపరాక్రమాలు, స్వాభిమానంతో కూడిన నాయకుల ప్రవర్తన, ప్రజల అపారమైన సహనం వంటివి చైనాకు సరైన సందేశాన్నే పంపాయి. దీనితో చైనా తన ధోరణిని మార్చుకుంటుందనే భావిస్తున్నాము. కానీ అలా కాకుండా తన దుడుకు వైఖరినే కొనసాగిస్తే అప్పుడు దానిని ఎదుర్కునేందుకు దేశ ప్రజానీకం సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్నారని స్పష్టమవుతోంది.
దేశానికి ఎదురవుతున్న బాహ్య ప్రమాదాల వల్లనేకాక గత సంవత్సరం దేశం లోపల జరిగిన అనేక సంఘటనలు కూడా మన జాగరూకంగా ఉండాలని మనను హెచ్చరిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం కోసం పోటీ పడటం సహజం. కానీ ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి. అది శత్రువుల మధ్య యుద్ధంలా మారకూడదు. సామాజిక వ్యవస్థను బలహీనం చేసే ద్వేషం, శతృత్వం, పగగా అది మారకూడదు. పోటీదారుల మధ్య తేడాలను ఆసరాగా చేసుకుని ఈ దేశంలోని వైవిధ్యాన్ని విభేదాలుగా చూపించి ప్రజలను చీల్చడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి శక్తులు ప్రపంచమంతటా ఉన్నాయి. కానీ అవి అనుకున్న పని సాధించే అవకాశం మనం ఇవ్వకూడదు. సమాజంలో నేరాలు, హింసకు పాల్పడేవారిని వెంటనే గుర్తించి, అదుపులోకి తీసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలు ప్రజల సహకారంతో పనిచేయాలి. మన చర్యలు అరాచక శక్తులకు అవకాశంగా మారకుండా జాగ్రత్తవహించాలి. దానికోసం మనం అన్నీ మతాలు, ప్రాంతాలు, కులాలు, భాషలకు చెందినవారి పట్ల ఒకే సంవేదన కనపరచాలి. రాజ్యాంగ పద్దతులకు లోబడి వ్యవహరించాలి. దురదృష్టవశాత్తు మన సామాజిక, సాంస్కృతిక విలువలను వ్యతిరేకించేవారు ప్రజస్వామ్యం, రాజ్యాంగం, సెక్యులరిజం అంటూ సందేశాలు ఇస్తున్నారు, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. 1949 ఆగస్ట్ 29నాటి రాజ్యాంగ సభ ఉపన్యాసంలో డా. బీమ్ రావ్ అంబేడ్కర్ ఇలాంటి శక్తులను గురించి చెప్పడానికి `అరాచకత్వపు పరిభాష’ (grammar of anarchy)అనే మాటను ఉపయోగించారు. మనం అలాంటి శక్తులను గుర్తించి, వారి కుట్రలు, కుతంత్రాల గురించి మన సోదరసోదరిమణులను హెచ్చరించాలి.
సంఘ గురించి ఇలాంటి అపోహలు కలగకుండా ఉండేందుకు సంఘ ఉపయోగించే పరిభాష, దాని వ్యాఖ్య తప్పనిసరిగా తెలియాలి. హిందుత్వ అనేది అలాంటి ఒక మాట. ఈ పదానికి ఆచారాలు, సంప్రదాయాలు అనే దుర్వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. కానీ సంఘ్ అలాంటి అర్ధంలో ఆ పదాన్ని ఉపయోగించదు. భారత భూమిలోని విలువల వ్యవస్థ, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరంపరను గుర్తుచేసే పదంగానే దానిని ఉపయోగిస్తుంది. కాబట్టి పురాతన కాలం నుంచి ఇక్కడి అధ్యాత్మిక చింతనను సొంతం చేసుకున్న పూర్వజుల నైతిక వర్తనాన్ని అనుసరించే, అది తమదిగా భావించే 130కోట్లమంది ప్రజానీకానికీ ఆ పదం వర్తిస్తుందని సంఘ్ భావిస్తుంది. ఈ పదానికి ఉన్న సరైన అర్ధాన్ని తెలుసుకోకపోతే అది ఈ సమాజంతో, దేశంతో మన సంబంధాన్ని పూర్తిగా తెలుసుకోలేము. ఈ దేశాన్ని వివిధ సమూహాలుగా విడగొట్టాలనుకునేవారు అందుకనే ముందు ఈ పదాన్ని పట్టుకుని రాద్దాంతం చేస్తూ ఉంటారు. హిందూ చింతనలో భాగమైన ఈ వైవిద్యాన్ని తమ వేర్పాటువాదానికి ఆధారం చేసుకుంటారు. `హిందూ’ అంటే ఒక మతసంప్రదాయం కాదు, ఒక ప్రాంతీయ భావన కాదు, ఒక కుల సంప్రదాయం కాదు, ఒక భాషకు చెందినవారిని గుర్తించే పదం కాదు. అనేక ప్రత్యేకతలు కలిగిన, ఒక అపారమైన నాగరికతకు సంబంధించిన భావాత్మక ఏకత్వమే హిందూ అనే పదం. కొందరికి ఈ పదాన్ని ఒప్పుకోవడంలో అనేక అభ్యంతరాలు ఉండవచ్చును. కానీ ఈ భావాత్మక ఏకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వారు మరేదైనా పదాన్ని ఉపయోగిస్తామంటే అభ్యంతరం ఏమి లేదు. అయితే దేశ సమైక్యత, భద్రతలను దృష్టిలో పెట్టుకుని హిందూ అనే పదానికి ఉన్న వివిధ అర్ధాలను సమన్వయం చేయడానికి సంఘ్ ప్రయత్నించింది. హిందూస్థాన్ హిందూ రాష్ట్రం అని సంఘ్ అన్నప్పుడు అందులో రాజకీయ అధికారంతో ముడిపడిన ఎలాంటి ఆలోచన ఉండదు, లేదు. ఈ రాష్ట్రపు(దేశపు) `స్వ’(గుర్తింపు)హిందూత్వం. మన ప్రతిఒక్కరి సామాజిక, కుటుంబ, వృత్తి, వ్యక్తిగత జీవితాలలో ప్రతిఫలించే విలువలు అన్నీ హిందూ సామాజిక, సాంస్కృతిక సంప్రదాయాల నుండి వచ్చినవే కాబట్టి హిందూత్వం మన దేశపు అస్తిత్వమని, గుర్తింపు అని మేము అంటాము. ఈ భావాత్మక ఏకత్వాన్ని అనుభవించడానికి ఎవరూ తమ మతసంప్రదాయాలను, భాషను, ప్రాంతీయ గుర్తింపును వదులుకోవలసిన అవసరం లేదు. కేవలం ఆధిక్యత, అధికార భావనను, ప్రయత్నాన్ని వాదులుకోవాలి. సర్వోన్నత ఆధిక్యత, అధికారం సంపాదించవచ్చని చెపుతూ పిడివాదాన్ని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే, ప్రేరేపించే ద్వేషపూరిత, స్వార్ధ శక్తుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి.
దేశంలోని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీలలో వేర్పాటువాద బీజాలను నాటేందుకు, భిన్నత్వంలోనే అంతర్నిహితంగా ఉన్న ఏకత్వాన్ని నాశనం చేసేందుకు చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇలాంటి వేర్పాటువాదాన్ని ప్రచారం చేసే సమూహాలే `భారత్ తెరే తుక్దే హోంగే’ (భారత్ ముక్కలవుతుంది) అంటూ నినాదాలు చేస్తారు. రాజకీయ ప్రయోజనాలు, వేర్పాటువాద, విచ్ఛిన్నకర ధోరణులు భారతీయ ఏకత్వానికి ముప్పుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఎంతో సంయమనంతో, సహనంతో, అవగాహనతో వ్యవహరించాలి. ఈ శక్తుల బారిన పడకుండా మనం రాజ్యాంగానికి లోబడి శాంతియుతమైన మార్గాల్లో దేశంలో ఏకత్వభావాన్ని నిలబెట్టాలి. ఇలాంటి సంయమనం, సంతులన ధోరణి వల్ల పరస్పరం విశ్వాసం కలుగుతుంది. ఇతరుల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించగలుగుతాము. ఈ పరస్పర విశ్వాసం వల్ల సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ప్రతీకారాత్మక, తీవ్రమైన ధోరణి వల్ల విభేదాలు పెరిగి హింసకు దారితీస్తుంది తప్ప ప్రయోజనం ఉండదు.
ఈ పరస్పర స్నేహభావాన్ని, సహనాన్ని, సంయమనాన్ని పెంపొందించుకోవాలంటే మనకు మన బృహత్ అస్తిత్వానికి సంబంధించిన అవగాహన ఉండాలి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం పరుగులు పెడితే లాభం లేదు. భారత్ నుంచి భారతీయతను తీసివేయలేము. ఇలా చేయాలని ప్రయత్నించినవారంతా విఫలమయ్యారు. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అభివృద్ధి సాధించాలన్న ఆకాంక్ష మన అందరినీ ఒకటి చేస్తున్నది. కేవలం భరించడం కాదు, అంగీకరించడం అనే హిందూ సంస్కృతి, సంప్రదాయాల మౌలిక సూత్రం వల్లనే ఇక్కడ అనేక మతాలు విలసిల్లాయి. ఆ ధోరణే ఇప్పుడు కూడా అవసరం.
సంఘ వెలువరించే అన్నీ ప్రకటనల్లో `హిందూ’ అనే పదం తరచుగా కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి అనేక విషయాలు ప్రస్తుతం చర్చలోకి వస్తున్నందువల్ల ఈ పదాన్ని గురించి వివరించాల్సివచ్చింది. అలా తరచూ చర్చకు వస్తున్న విషయాల్లో ఒకటి `స్వదేశీ’. స్వదేశీ పదంలోని `స్వ’ అంటేనే హిందూత్వం. ఆ శాశ్వత, సనాతన తత్వం వల్లనే మనకు ఇంతటి సమన్వయ, సహకార, సహన ధోరణి అలవడింది. దాని మూలంగానే స్వామి వివేకానంద అమెరికా ప్రజానీకాన్ని కూడా సోదరసోదరీమణులారా అని సంబోధించారు. ప్రముఖ కవి, నోబుల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ టాగోర్ కూడా భారతీయ పునరుజ్జీవనానికి ఈ తత్వ దృష్టే ఆధారమని తన `స్వదేశీ సమాజ్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఈ విషయాన్నే శ్రీ అరవిందులు తమ ఉత్తరపర ఉపన్యాసంలో ప్రస్తావించారు. 1857 తరువాత ఇక్కడి సమాజంలో జరిగిన మేధోమధనం, ఇక్కడి జాతీయ సంస్థలు ఎదుర్కొన్న అనేక అనుభవాలు మొదలైనవన్నీ మన రాజ్యాంగ పీఠికలో ప్రతిఫలిస్తున్నాయి.
అదే భారతీయ తత్వం. ఈ `స్వ’ తత్వమే మన అన్నీ కార్యకలాపాలకు, ఆలోచనలకు మూలం కావాలి. మన ప్రయత్నాలు, వాటి పరిణామాలు ఈ సూత్రానికి అనుగుణంగానే ఉండాలి. అలా జరిగినప్పుడు మాత్రమే భారత్ స్వావలంబన సాధించినట్లు. ఉత్పత్తి కేంద్రాలు, కార్మిక శక్తి, ఆర్ధిక లాభాలు, ఉత్పత్తి హక్కు మొదలైనవన్నీ జాతీయ నియంత్రణలో ఉండాలి. అయితే స్వదేశీ విధానానికి అది ఒక్కటే సరిపోదు. స్వావలబనతో, అహింసా విధానపు మేలు కలయికే స్వదేశీ అని వినోబా భావే చెప్పారు. జాతీయ స్వావలంబన, సార్వభౌమత్వం సాధించి అంతర్జాతీయ సహకారాన్ని పొందే స్థితినే స్వదేశీ అంటూ దత్తోపంత్ ఠేంగ్డేజీ అన్నారు. అది వస్తువులు, సేవలకంటే మించిన విషయమని ఆయన చెప్పారు. కనుక ఆర్ధిక స్వాతంత్రంత్యాన్ని, స్వావలంబనను సాధించడానికి, అంతర్జాతీయ సహకారాన్ని పొందడానికి మనం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చే విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తాముకానీ అవి మనకు సమ్మతమైన పద్దతులలో, పరిస్థితుల్లో పనిచేయడానికి సిద్ధపడాలి.
స్వావలంబన అంటే స్వీయ అస్తిత్వంపై ఆధారపడి కార్యకలాపాలు సాగించడం. మన ధోరణే మన లక్ష్యాన్ని, మన మార్గాన్ని నిర్ధారిస్తుంది. ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న పద్దతుల ద్వారా మనం కూడా కొంత విజయాన్ని సాదించవచ్చునుగాక. కానీ అందులో `స్వ’ అనేది ఉండదు. ఉదాహరణకు వ్యవసాయ విధానం వల్ల రైతుకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలుపై పూర్తి అధికారం ఉండాలి. అవసరమైతే పక్కనే ఉన్న గ్రామం నుంచి తెప్పించుకోగలిగిన స్వేచ్చా, అవకాశం ఉండాలి. అలాగే అతనికి ధాన్యం నిల్వ, మొదలైన విషయాల్లో పూర్తి అవగాహన కల్పించాలి. మనకు విస్తృతమైన, పురాతనమైన వ్యవసాయ చరిత్ర ఉంది. అందువల్ల ఆధునిక వ్యవసాయ పద్దతుల గురించి అవగాహన కల్పిస్తూనే కాల పరీక్షకు నిలచిన అనేక సంప్రదాయ పద్దతులను కూడా కొనసాగించే విధంగా రైతుకు స్వేచ్చనివ్వాలి. కేవలం లాభాలను దృష్టిలో పెట్టుకుని చేసే పరిశోధనలు, ప్రైవేటు కంపెనీల ఒత్తిడులు, మధ్యదళారుల బెడద లేకుండా రైతు తన పంటను తనకు తోచిన చోట అమ్ముకునే వీలు, వెసులుబాటు కల్పించగలిగితేనే అది సరైన స్వదేశీ వ్యవసాయ విధానం అవుతుంది. ఈ మార్పులన్నీ ఒకేసారి అమలు చేయడానికి వీలు కాకపోవచ్చును. అయితే ఈ మార్పులను సాధ్యమైనంత త్వరగా తీసుకువచ్చే వాతావరణాన్ని నిర్మించాలి.
`స్వ’ను ఆధారం చేసుకుని ఆర్ధిక, వ్యవసాయ, కార్మిక, ఉత్పత్తి, విద్యా విధానాలను రూపొందించడానికి ఇటీవల సకారాత్మక ప్రయత్నం జరిగింది. ఎంతో చర్చలు, సలహాలు, సంప్రదింపుల తరువాత నూతన విద్యావిధానం అమలుచేశారు. విద్యారంగానికి చెందినవారందరితోపాటు సంఘ్ కూడా కొత్త విధానాన్ని ఆహ్వానించింది. `వోకల్ టు లోకల్’ అనే నినాదం కూడా స్వదేశీకి అనేక దారులు తెరచింది. అయితే ఈ ప్రక్రియలన్నీ సజావుగా సాగి, సత్ఫలితాలు ఇవ్వాలంటే సునిశితమైన పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. కాబట్టి `స్వ’ తత్వాన్ని పూర్తిగా అర్ధం చేసుకుని, ఆచరించగలిగితేనే మనం సరైన దిశలో వెళ్లగలుగుతాము.
అభివృద్ధిలో సంఘర్షణ అనేది తప్పనిసరి అంశమని భారతీయ తత్వం పరిగణించదు. అన్యాయాన్ని అంతం చేయడానికి సంఘర్షణ చిట్టచివరి మార్గమని పేర్కొంటుంది. ఇక్కడ అభివృద్ధి సూత్రీకరణ సహకారం, సమన్వయాలపై ఆధారపడి సాగింది. కాబట్టి వివిధ రంగాల్లో స్వావలంబన సాధించడానికి ఏకాత్మ భావన చాలా కీలకం. పరస్పర సహకారంతో , సమన్వయపూర్వక కృషితో దేశం మొత్తం సాధించే అభివృద్ధినే స్వావలంబన అనవచ్చును. శరీరంలోని అవయవాలన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడి పనిచేసినట్లుగా. ఒక విధానాన్ని రూపొందించేవారు కలిసి పనిచేసినప్పుడే, పరస్పర విశ్వాసం, ఐకమత్యభావంతో వ్యవహరించినప్పుడే ఆ పని సాధ్యపడుతుంది. ఏదైనా విషయాన్ని అందరూ కలిసి చర్చించడం, ఆ చర్చ ద్వారా ఒక నిర్ణయానికి రావడం, నిర్ణయించిన విధంగా పరస్పర సహకారంతో కార్యాన్ని నిర్వహించడం అనే పద్దతి కుటుంబం నుంచి సమాజం దాకా అంతటా కనిపించే ప్రక్రియే.
సమానో మంత్రః సమితిః సమానీ
సమానం మనః సహచిత్తమేషామ్
సమానం మంత్రమభిమంత్ర ఏవః
సమానీనవో హవిషా జూహూమి
(మన మాట ఒకటి అగునుగాక, మన స్వరం ఒకటి అగునుగాక, మన మనస్సులు వివేకవంతమైన ఆలోచనలతో ఒకటి అవునుగాక, ఒకే లక్ష్యాన్ని కలిగిన మనం, ఏకత్వాన్నే ఆరాధింతుముగాక).
అదృష్టవశాత్తు ప్రస్తుత రాజకీయ నాయకత్వం ప్రజల్లో ఏకత్వ భావన, విశ్వసాలను పాదుకొల్పగలదని ఆశించవచ్చును.
అదృష్టవశాత్తు ప్రస్తుత రాజకీయ నాయకత్వం ప్రజల్లో ఏకత్వ భావన, విశ్వసాలను పాదుకొల్పగలదని ఆశించవచ్చును.
చిన్న, మధ్యతరహా సంస్థలకు మద్దతునివ్వడం ద్వారా వ్యవసాయ, ఉత్పత్తి రంగాలను వికేంద్రీకరించడం, ఉపాధి అవకాశాలు పెంచడం, స్వయంఉపాధిని ప్రోత్సహించడం, పర్యావరణ అనుకూల వ్యాపారాన్ని ప్రారంభించడం, స్వయంసమృద్ధమైన ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేయడం వంటివి ఆర్ధికాభివృద్ధికి దోహదం చేస్తాయి. ఇవి అనేకమంది మేధావులు, ఆర్ధిక నిపుణుల దృష్టిని ఆకర్షించాయి. వివిధ రంగాల్లో పనిచేస్తున్నవారంతా దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నారు. ప్రపంచ పోటీని తట్టుకుని నిలబడేవిధంగా ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన వస్తువులు ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం వీరికి తగిన సహాయ, సహకారాలు అందించాలి. కరోనా సంక్షోభం తరువాత తిరిగి తమ పనులు ప్రారంభించుకునేందుకు వీరికి నిధులు కేటాయించాలి. అవి వారికి సక్రమంగా అందే ఏర్పాటు చేయాలి.
అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ దేశ సంస్కృతి, ప్రజల ఆకాంక్షలకు తగిన మార్గాన్ని ఎంచుకోవాలి. అందరితో చర్చించిన తరువాత రూపొందించిన ప్రణాళికను తూచ తప్పకుండా అమలుచేయాలి. అభివృద్ధి ఫలాలు అట్టడుగున ఉన్నవారికి అందినప్పుడు, మధ్య దళారుల దోపిడి, శోషణ పూర్తిగా తొలగినప్పుడు, ఉత్పత్తిదారులకు నేరుగా మార్కెట్ అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే మన కలలు సాకారమవుతాయి. లేకపోతే మళ్ళీ వైఫల్యాలు ఎదురవుతాయి.
సూచనలు, సలహాలు చాలా ముఖ్యమైనవే అయినా సమాజపు సామూహిక సంకల్పం దేశాభివృద్ధికి చాలా కీలకమైనది. కరోన సంక్షోభం వల్ల వ్యక్తమైన `స్వ’ తత్వం, ప్రజల్లో ఐకమత్యం, సాంస్కృతిక విలువలు, పర్యావరణ స్పృహ మొదలైనవాటిని సమాజం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీటిని కోల్పోతే మనం మళ్ళీ ఆలోచనారహిత వ్యవహారశైలికి అలవాటుపడే ప్రమాదం ఉంది. సమాజం మొత్తంలో క్రమశిక్షణతో కూడిన, సరైన వ్యవహారశైలి అలవడినప్పుడే విజయం సాధించగలుగుతాం. ప్రతి కుటుంబం ఈ బృహత్ ప్రయత్నంలో భాగం కావాలి. ప్రతి వారం కుటుంబ సభ్యులందరూ ఒకచోట కూర్చుని కొంతసేపు భజన చేసి ఆ తరువాత రెండు మూడు గంటలు వివిధ విషయాలపై చర్చించుకోవచ్చును. పైన మనం అనుకున్న విషయాలనే చర్చించవచ్చును. ఈ చర్చ అనేది ముఖ్యం. దీనినే మన శాస్త్రాల్లో ఇలా చెప్పారు –
సన్తః పరీక్ష్యన్యతరద్ భజన్తే ముడః పరాప్రత్యనేయ బుద్ధిః
ఇలా కుటుంబంలోని అందరూ పిచ్చాపాటీగా మాట్లాడుకుంటూ చర్చించిన విషయాలు, తీసుకున్న నిర్ణయాలే శాశ్వతమైన ప్రవర్తనా మార్పులను తెస్తాయి.
ఈ కుటుంబ సమావేశాల్లో మొదట్లో ఇంటికి సంబంధించిన వస్తువులు, ఇంటి రూపురేఖలు, కుటుంబ పద్దతులు, ఆచారవ్యవహారాలు మొదలైనవాటి గురించి చర్చించవచ్చును. అలాగే అందరికీ తెలిసిన పర్యావరణ పరిరక్షణ విషయాన్ని గురించి మాట్లాడుకోవచ్చును. ప్లాస్టిక్ నిషేధం, నీటి పరిరక్షణ, ఇంటి పెరటిలో మొక్కలు పెంచడం మొదలైనవి చర్చించవచ్చు. కుటుంబ అవసరాల కోసం మనమందరం డబ్బు , సమయం ఖర్చు చేస్తూనే ఉంటాం. కానీ సమాజం కోసం ఎంత వెచ్చిస్తున్నామని చూసుకోవాలి. వివిధ కులాలు, వర్గాలకు చెందినవారితో మనకు స్నేహసంబంధాలు ఉన్నాయా? ఎన్ని భాషలు మనకు తెలుసు? ఇవన్నీ సామాజిక సమరసతను పెంచే ముఖ్యమైన విషయాలు. కుటుంబ సభ్యులందరూ కలిసి రక్తదానం, నేత్రదానం చేయవచ్చును. ఈ విషయాలపై ఇతరులకు అవగాహన కలిగించవచ్చును.
Through these minute undertakings, harmony, uprightness, patience, discipline and values-driven personal conduct can be cultivated. Consequently, our collective behaviour while in keeping with the civic discipline becomes that which augments mutual cooperation and harmony. If we work to raise the general level of consciousness of a common man and nurture his intrinsic spirit of oneness with Hindutva as the guiding force, if we make individual efforts for developmental progress with a deeper understanding of the structure of our country and acknowledge our interdependence to cooperate with other members of the society, if we have confidence in our collective strength to achieve any dream and set developmental goals rooted in our values then in the near future Bharatvarsh will emerge as the torchbearer for the rest of the world and come to be known as the Bharatvarsh that showed the path of peaceful and congenial progress to humanity- freedom and equality in the true sense of the word.
Behavioural conduct of such individuals and families will create an overall atmosphere of fraternity, meaningful action and lawful order in the whole country. Rashtriya Swayamsevak Sangh has been working to effect these changes directly in the society since 1925. Such an organised state is the natural state of a healthy society. Such an organised society is the precondition for the resurrection of this country that has become independent after the centuries-long darkness of invasions. Many great personalities have worked to build such a society. After independence, with this very goal in mind, our constitution was crafted in age-relevant codes of desired conduct and passed on to us. Sangh work only will ensure inculcating a clear vision to realise the objectives of our constitution, and the conduct of mutual harmony, the spirit of oneness and the sentiment of national interest are paramount. Swayamsevaks are sincerely, selflessly and dedicatedly involved in realising this goal. With an invitation that you all to be their fellow-workers in this campaign for upstart reconstruction, I end my address here.
“प्रश्न बहुत से उत्तर एक, कदम मिलाकर बढ़ें अनेक।
वैभव के उत्तुंग शिखर पर, सभी दिशा से चढ़ें अनेक।।“
।। भारत माता की जय।।
_విశ్వ సంవాద కేంద్రము