వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్ లో హింస చెలరేగింది. ఈ సందర్భంగా ముస్లిం ఛాందసులు హిందువులపై దాడులు, హిందువుల ఆస్తులను ధ్వంసం చేశారు.
హిందువులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు కూడా. అయితే.. రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. తమపై ఇస్లామిక్ ఛాందసులు అత్యాచార బెదిరింపులకు దిగుతున్నారంటూ ముర్షిదాబాద్ కి చెందిన ఓ హిందూ మహిళ పేర్కొంది. శారీరికంగా తమ వాంఛనైనా తీర్చాలి, లేదంటే భర్త ప్రాణాలను, పసి పిల్లల ప్రాణాలనైనా ఫణంగా పెట్టాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని వెల్లడించారు.
‘‘మా శారీరక వాంఛను తీర్చడానికి సరేనంటే మీ భర్తను, పిల్లలను విడిచిపెడతాము.లేదంటే అంతే సంగతులు అని అంటున్నారు. ఇదీ మా పరిస్థితి. ఇంతకన్నా ఏం చెప్పాలి? ఇలాంటి పరిస్థితుల్లో మా ఇళ్లకు తిరిగి ఎలా వెళ్లగలం? ఇంకా ఎక్కడికి పారిపోవాలి చెప్పండి.’’అంటూ గద్గత స్వరంతో హిందూ మహిళలు తమ గోడు చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి చూస్తే.. హిందూ మహిళల పరిస్థితి ఏ విధంగా వుందో ఊహించుకోవచ్చు.
ఇక.. ముర్షీదాబాద్ ప్రాంతానికే చెందిన మరో హిందూ మహిళ కూడా తన గోడును వెల్లబోసుకుంది. అత్యంత బాధాతప్త హృదయంతో తమ గోడును చెప్పుకుంది. తనతో పాటు ఇతర హిందూ మహిళను కూడా అత్యాచారం చేస్తామని ఛాందసులు బెదిరిస్తున్నారని, తాము మనుగడ సాగించాలన్నా, జీవించాలన్నా తమ గౌరవాన్ని వదులుకోవాల్సిన దుస్థితికిలోకి వచ్చేశాం’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక... ముర్షీదాబాద్ కి చెందిన లతికా అనే హిందూ మహిళ కూడా స్పందించింది. తాము తిరిగి తమ ఇళ్లకు వెళ్తామో లేదో తెలియడం లేదు. మా ఇళ్లల్లో ఏమేమి మిగిలి వున్నాయో కూడా తెలియడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. తాము పార్లార్ పూర్ లో ఏర్పాటు చేసిన శరణార్థుల శిబిరాల్లో కుటుంబంతో వున్నామని తెలిపింది.‘‘ ఛాందసులు హింస చేస్తున్న సమయంలో ఇంటిపైన దాక్కున్నాం. ప్రతి హిందూ ఇంటినీ కూలగొట్టేస్తున్నారు. మా ఇంటి పరిస్థితి కూడా అంతే. దీంతో తీవ్ర భయ భ్రాంతులకు లోనయ్యాం. కానీ.. కొంతలో కొంత మా ఇల్లు, కుటుంబీకులం బయటపడ్డాం. కానీ... మరెప్పుడైనా హింస చెలరేగితే మాత్రం నిప్పు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది’’ అని పేర్కొంది.