పశ్చిమ బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న హింసను నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళన: VHP
![]() |
VHP |
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న మారణకాండను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా నిరసిస్తోంది. బెంగాల్ రాష్ట్రంలో హిందువులకు రక్షణ కల్పించాలని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. WAQF బిల్లు పేరుతో హిందువులను అత్యంత దారుణంగా హింసకు గురి చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు (శనివారం, 19వ తేదీన) నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షులు భోజన పల్లి నరసింహమూర్తి, జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించి , జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి వినతి పత్రాలను చేరాలని విన్నవించనున్నట్లు తెలిపారు. హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో హాజరై నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. WAQF చట్టం పేరుతో హిందువులను టార్గెట్ చేసుకొని.. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తున్న ఉగ్రముఖలను కఠినంగా అణచివేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు
భవదీయ:
ప్రచార ప్రముఖ్ - విశ్వహిందూ పరిషత్
తెలంగాణ రాష్ట్రం
మొబైల్: 9912975753, 9182674010