![]() |
Dattatreya Hosabale |
జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఖండించింది. ఈ మేరకు ఎక్స్ మాధ్యమంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే స్పందించారు.
‘‘జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఖండించదగింది. అత్యంత హృదయవిదారకమైంది. ఈ ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఇది దేశ ఐక్యత, సమగ్రతపై దాడి. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు తమ తమ విభేదాలను పక్కనపెట్టి, ఈ ఉగ్రవాద చర్యను ఖండించాలి.బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయాలను ప్రభుత్వం అందించాలి. ఈ దాడికి కారకులైన వారిని శిక్షించాలి’’ అని దత్తాత్రేయ హోసబళే అన్నారు.