జమ్మూ కశ్మీర్ లోని పహల్గావ్ ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు పర్యాటకులపై ఉగ్రదాడికి దిగారు. ఈ ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు తమ ప్రాణాలను కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. జమ్మూ కశ్మీర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడుల నెత్తుటి చారలు గతంలోనూ వున్నాయి. వాటి వివరాలివీ...
- 1. 23.3.20023 : పుల్వామా జిల్లా నందిమార్గ్ గ్రామంలో ఇద్దరు చిన్నారులు, 11 మంది మంది మహిళలతో సహా 24 మంది కశ్మీరీ పండితులను ఉగ్రవాదులు ఊచకోత కోశారు.
- 2. 10.7.2017 : కుల్గామ్ లో అమరనాథ్ యాత్ర బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో 8 మంది మరణించారు.
- 3. 12.6.2006 : కుల్గామ్ లో నేపాల్, బిహార్ కి చెందిన 9 మంది కార్మికులను హత మార్చారు.
- 4. 13.6.2005 : పుల్వామాలో కారుబాంబును పేల్చి ముగ్గరు సీఆర్పీఎఫ్ అధికారులు, ఇద్దరు విద్యార్థులు సహా 13 మంది మరణించారు.
- 5. 23.11.2002 : దక్షిణ కశ్మీర్ లోని జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై గల దిగువ ముండాలో ఐఈడీ పేలుడులో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు, 9 మంది భద్రతా సిబ్బందితో సహా 19 మంది మరణించారు.
- 6. 2002 : ఈ యేడాదిలో చందన్ వాడీ బేస్ క్యాంపుపై ఉగ్రదాడి. 11 మంది అమర్ నాథ్ యాత్రికుల మృతి.
- 7. జనవరి 10,2001 : శ్రీనగర్ లోని జమ్మూ కశ్మీర్ శాసనసభ కాంప్లెక్స్ పై ఆత్మాహుతి దాడి. ఈ దాడిలో 36 మంది పౌరులు మరణించారు.
- 8. జూలై 20001 : అనంతనాగ్ లోని శేషనాగ్ బేస్ క్యాంపులో 13 మంది అమరనాథ్ యాత్రికులను హత్య చేశారు.
- 9.21.3.2000 : అనంతనాగ్ జిల్లా ఛత్తీసింగ్ పోరా గ్రామంలో సిక్కులపై ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి చేశారు. 36 మందిని కాల్చి చంపారు.
- 10. 5. ఆగస్టు 2000 : నన్ వాన్ బేస్ క్యాంపులో 24 మంది అమరనాథ్ యాత్రికులతో సమా 32 మందిని ముష్కరులు హత మార్చారు.
- 11. 28.07.1998 : అమరనాథ్ యాత్ర బృందంపై లష్కరే తోయిబా ముష్కరులు దాడి చేశారు. ఈ దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
- 12.2. 25.01.1998 : కశ్మీరీ పండితులపై రాత్రివేళ కాల్పులు... ఈ కాల్పుల్లో 23 మంది మరణించారు.